తన సినీ కెరీర్ లో ప్రభాస్ ను ఎంతగానో భయపెట్టిన సినిమా ఏంటో మీకు తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్( Prabhas ) నటించిన ఆదిపురుష్( Adhipurush ) మూవీ రిలీజ్ కావడానికి మరో నాలుగు వారాల సమయం ఉంది.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు.ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సినిమా ఇండస్ట్రీలో ఉండటం సంతోషాన్ని కలిగించే విషయమని ఆదిపురుష్ సినిమా నన్ను భయపెట్టిందని ఆయన తెలిపారు.

"""/" / ఆదిపురుష్ హిందీ వెర్షన్ హీరో పాత్రకు శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్పారు.

నేను డబ్బింగ్ చెప్పడంలో భాగంగా ఆదిపురుష్ చూశానని ఆయన చెప్పుకొచ్చారు.ఆదిపురుష్ మూవీ చాలా బాగుందని సినిమా తుది మెరుగులు దిద్దిన తర్వాత మరింత బాగుంటుందని శరద్ కేల్కర్ ( Sharad Kelkar )చెప్పుకొచ్చారు.

ఆదిపురుష్ కంటెంట్, ఈ సినిమాను తెరకెక్కించిన విధానం బాగుందని ఆయన కామెంట్లు చేశారు.

ఆదిపురుష్ డబ్బింగ్ పూర్తైన తర్వాత ప్రభాస్ ను కలవగా ఆయన ఆప్యాయంగా హత్తుకున్నారని శరద్ కేల్కర్ వెల్లడించారు.

డబ్బింగ్ చాలా బాగా చెప్పావని ప్రభాస్ ప్రశంసించారని ఆయన పేర్కొన్నారు.ప్రభాస్ నుంచి దక్కిన ప్రశంసను అతిపెద్ద ప్రశంసగా భావిస్తానని శరద్ కేల్కర్ పేర్కొన్నారు.

"""/" / ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

600 నుంచి 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

ఆదిపురుష్ సినిమా ప్రభాస్ కు కెరీర్ బిగ్గెస్ట్ ను అందిస్తుందేమో చూడాలి.సాహో, రాధేశ్యామ్ ప్రేక్షకులను నిరాశ పరిచాయి.

ఆదిపురుష్ మాత్రం అంచనాలను మించి సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఆదిపురుష్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ సినిమా నుంచి త్వరలో మరిన్ని షాకింగ్ అప్ డేట్స్ అయితే రానున్నాయని సమాచారం.

శరద్ కేల్కర్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

హీరోగానే ఉండిపోవాలని శోభన్ బాబు రిజెక్ట్ చేసిన రోల్స్ ఇవే.. ఇంత మంచి పాత్రలు వదులుకున్నారా?