ఈసారి ప్రభాస్ బర్త్ డే అదిరిపోవాలి.. మరో సూపర్ హిట్ సినిమాతో..
TeluguStop.com
మన తెలుగు వారి అభిమానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఒక్కసారి ఏ హీరోకు అయినా ఫ్యాన్ అయినారంటే ఇక వారిని ఎంతగా అభిమానిస్తారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.
అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.ఇక వారి పుట్టిన రోజులను ఎంతగా సెలెబ్రేట్ చేస్తారో కూడా చూస్తూనే ఉంటాం.
వారి పుట్టిన రోజులకు కూడా అంతా హంగామా చెయ్యరు.కానీ తమ హీరో పుట్టిన రోజు అంటే మాత్రం ఒక నెల ముందు నుండే హంగామా స్టార్ట్ అవుతుంది.
మరి ఈ మధ్య ఫ్యాన్స్ కోసం టాలీవుడ్ కొత్త ట్రెండ్ తెచ్చింది.తమ అభిమాన హీరో కెరీర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచి పోయిన సినిమాలను వారి పుట్టిన రోజు వేడుకలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ వారి ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారు.
ఎప్పటి నుండో ఇలా చేస్తున్న ఇప్పుడు ఆ ట్రెండ్ మరింత ఎక్కువ అవుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల పుట్టిన రోజులకు వారి క్లాసిక్ హిట్స్ ను మరోసారి ప్రదర్శించారు.
అయితే కొత్త సినిమాల కంటే కూడా ఈ సినిమాలకు అనూహ్య స్పందన వస్తుంది.
4K రిజొల్యూషన్ లోకి రీ మాస్టర్ చేసి డాల్ఫీ ఆడియోతో కొత్తగా రిలీజ్ చేస్తున్నారు.
ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వంతు వచ్చింది.ఈయన పుట్టిన రోజు అక్టోబర్ 23న కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఆయన క్లాసికల్ హిట్ సినిమాలను మరోసారి ప్రదర్శితం చేస్తున్నారు.
ప్రభాస్ నటించిన రెబల్ సినిమాను అక్టోబర్ 15న రీరిలీజ్ చేయబోతున్నారు. """/"/
ఇక మరో సినిమా కూడా ఇప్పుడు రీరిలీజ్ చేయబోతున్నట్టు టాక్.
ప్రభాస్ కెరీర్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన వర్షం సినిమాను అక్టోబర్ 22, 23 తేదీల్లో రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర నిర్మాత ఎమ్ ఎస్ రాజు తెలిపారు.
దీంతో ఆడియెన్స్ కు పండుగ అనే చెప్పాలి.వర్షం సినిమాలో ప్రభాస్ హీరోగా త్రిష హీరోయిన్ గా నటించగా.
గోపీచంద్ విలన్ పాత్రలో నటించాడు.ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకుల మనస్సులో సుస్థిర స్థానం ఏర్పరుచుకుంది.
మరి ఈ సినిమా రీ రిలీజ్ ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.
బడా ప్రొడ్యూసర్ కు 1200 ల ఎకరాలు… కాస్ట్లీగిఫ్ట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్?