ప్రభాస్‌ బర్త్‌ డే స్పెషల్‌ పై గందరగోళం.. ఎవరికి తోచినట్లు వారు!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం పలు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా రాబోతున్న ప్రత్యేక సినిమా ఏంటి అనే విషయంలో అభిమానుల్లో ఒకింత గందరగోళం నెలకొంది.

నిన్న మొన్నటి వరకు రెబల్ సినిమాను కృష్ణం రాజు జ్ఞాపకార్థం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసే అవకాశం ఉందని అంతా భావించారు, కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రెబల్ కాకుండా బిల్లా సినిమా ను రీ రిలీజ్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

బిల్లా సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా ఇతర దేశాల్లో కూడా స్క్రీనింగ్ అయ్యే అవకాశం ఉందని పెద్ద ఎత్తున సినిమా కు సంబంధించిన స్క్రీనింగ్ కోసం థియేటర్లను రెడీ చేశారని వార్తలు వస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా ఉన్న పలు మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో బిల్లా సినిమా స్క్రీనింగ్ చేయాలని ప్రభాస్ అభిమానులు చాలా ప్రయత్నిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా అభిమానులున్న ప్రభాస్ రెబల్ సినిమా వస్తుందా బిల్లా సినిమా రాబోతుందా అనే విషయం క్లారిటీ లేకపోవడంతో జుట్టు పీక్కుంటున్నారు.

రెండు సినిమా లు విడుదలైనా కూడా పరవాలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రెబల్ అట్టర్ ఫ్లాప్ సినిమా అయినా కూడా ఆ సినిమా లో కృష్ణం రాజు ఉన్న కారణంగా ఆయన ఇటీవల మృతి చెందిన కారణంగా ప్రభాస్ బర్త్‌ డే సందర్భంగా ఆ సినిమా ను రీ రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం తో కొందరు ఆ సినిమా ని రిలీజ్ చేయాలని అంటున్నారు.

"""/"/ కొందరు మాత్రం ప్రభాస్ నటించిన స్టైలిష్ మూవీ బిల్లా విడుదల చేయాలని కోరుకుంటున్నారు.

ఏది రీ రిలీజ్ అవ్వబోతుంది అనే విషయం తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ప్రభాస్ వచ్చే సంక్రాంతికి మరియు వచ్చే సమ్మర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమా లు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

ఆయన నటిస్తున్న మూడు నాలుగు సినిమాలు రాబోయే సంవత్సర కాలం లో ప్రేక్షకుల ముందుకు వస్తాయని అభిమానులు ధీమా తో ఉన్నారు.

పుట్టిన రోజుకి మరికొన్ని రోజులు సమయమే ఉన్న కారణంగా ప్రభాస్ అభిమానులు సందడి మామూలుగా లేదు.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను అరికట్టే బెస్ట్ సొల్యూషన్ ఇది.. డోంట్ మిస్..!