Prabhas Shahrukh Khan: ప్రభాస్ “సలార్” సినిమాతో షారుఖ్ ఖాన్ అడ్డాలో గట్టి దెబ్బ కొట్టాడుగా!
TeluguStop.com
నార్త్ ఇండియా సినిమా మాఫియా కి చెక్ పెట్టిన ఏకైక సౌత్ ఇండియన్ స్టార్ ప్రభాస్( Prabhas ) అని చెప్పుకోవచ్చు అంతేకాదు బాలీవుడ్ హీరోల స్టార్‌డమ్‌లకు కూడా తగ్గించేశాడు.
బాహుబలి సినిమా( Baahubali ) తర్వాత బాలీవుడ్ హీరోలు జోకర్లుగా కనిపించారనడంలో సందేహం లేదు.
వారు హిట్టు కొట్టడానికి నానా తంటాలు పడ్డారు.సౌత్ ఇండియన్ డైరెక్టర్ లేకుండా షారుఖ్ ఖాన్ గాని, రణ్‌బీర్ కపూర్ గానీ హిట్ కొట్టలేకపోయారంటే అతిశయోక్తి కాదు.
నార్త్ ఇండియాలో సాధారణంగా షారుక్ ఖాన్ కి ( Shahrukh Khan ) బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.
థియేటర్ యజమానులు కూడా షారుఖ్ సినిమాలకి వీరాభిమానులు అయి ఉంటారు.ఎంతగా అంటే ఒకే సినిమాని 28 ఏళ్లుగా థియేటర్లో నిరంతరాయంగా ప్రదర్శించే అంతగా.
అతని సినిమాని కాదని ఏ సౌత్ ఇండియా సినిమాని వేయరు.అలాంటిది సలార్ సినిమా విషయంలో తలకిందులు అయింది.
"""/" /
ముంబైలో మరాఠా మందిర్( Maratha Mandir ) అనే పేరుతో ఒక థియేటర్ ఉంది.
ఇదొక ఓల్డ్ థియేటర్.ఇప్పటికీ విజయవంతంగానే నడుస్తోంది.
ఈ సినిమా హాల్ గురించి స్పెషల్‌గా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇందులో 1995 కాలం నాటి దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే( Dilwale Dulhania Le Jayenge ) సినిమా ఇప్పటికీ ఆడిస్తున్నారు.
ఈ సినిమాతోనే షారుఖ్, కాజోల్ బిగ్గెస్ట్ బాలీవుడ్ స్టార్స్ గా ఎదిగారు.అప్పట్లోనే ఈ మూవీ 40 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కి రూ.
200 కోట్లు వసూలు చేసింది.ఇక దీనికి వచ్చిన అవార్డులు లెక్కలేదు.
"""/" /
ఈ సినిమాని ఇవాల్టి మార్నింగ్ వరకు కూడా మరాఠా మందిర్ ఆడించింది.
ఇదొక్క సినిమానే కాదు ఏ షారుఖ్ సినిమా రిలీజ్ అయినా సరే ఇది రిలీజ్ చేస్తుంది.
ఆ సమయంలో మిగతా ఏ సినిమాలను కూడా ఆడించదు.కానీ సలార్( Salaar ) విషయంలో మాత్రం థియేటర్ యజమానులు వెరైటీగా స్పందించారు.
షారుఖ్ ఖాన్ ఇటీవల డన్కీ సినిమాతో( Dunki Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాని మరాఠా మందిర్ నిన్నటిదాకా ఆడించింది.కానీ ఎప్పుడైతే సలార్ మూవీ వచ్చిందో దానిని వెంటనే తీసేసి సలార్ మూవీని ప్రదర్శించడం ప్రారంభించింది.
దీంతో షారుఖ్ పరువు తీసేసినట్లు అయింది.ప్రభాస్ ఇలా షారుఖ్ కి ఇచ్చిన ఝలక్ గురించి ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
బాబు మార్క్ రాజకీయం అంటే ఇదే ! జగన్ కు అర్థమయ్యిందా ?