బాలయ్య కోసం ప్రభాస్ ఇన్ని వంటకాలు చేయించారా.. రాజు ఎక్కడున్నా రాజేగా!

స్టార్ హీరో ప్రభాస్ మనస్సు చాలా మంచి మనస్సు అని తనతో ఉండేవాళ్లను ప్రభాస్ ఎంతో ప్రేమగా చూసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎక్కువ మొత్తం ఆర్థిక సహాయం ప్రకటించే విషయంలో ప్రభాస్ ముందువరసలో ఉంటారు.

సాహో, రాధేశ్యామ్ సినిమాలు అనుకున్న ఫలితాన్ని అందుకోకపోయినా ప్రభాస్ మార్కెట్ పై ఆ ప్రభావం అణువంతైనా పడలేదనే సంగతి తెలిసిందే.

తాజాగా అన్ స్టాపబుల్ షో సీజన్2 గోపీచంద్ తో కలిసి గెస్ట్ గా హాజరైన ప్రభాస్ సెట్ మొత్తానికి విందు భోజనం ఏర్పాటు చేయించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాలయ్య కోసం ప్రభాస్ చేయించిన వంటకాల జాబితా తెలిస్తే షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది.

ఈ విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ రాజు ఎక్కడున్నా రాజే అని ప్రభాస్ ఆతిథ్యం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.

"""/" / స్టార్ హీరో బాలయ్యకు ఇష్టమైన వంటకాల వివరాలను తెలుసుకుని ఆ వంటకాలను ప్రభాస్ ప్రత్యేకంగా తయారు చేయించారని తెలిసి బాలయ్య అభిమానులు కూడా తెగ సంతోషిస్తున్నారు.

ప్రభాస్ చేయించిన వంటకాల జాబితాలో మటన్ బిర్యానీ, పీతల ఇగురు, చేపల పులుసు, మటన్ కర్రీ, చికెన్, ఇతర వంటకాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

"""/" / నాన్ వెజ్ వంటకాలతో పాటు సాంబార్, పప్పు, ఆవకాయ్ లాంటి టేస్టీ వెజ్ ఐటమ్స్ ను కూడా ప్రభాస్ ప్రత్యేకంగా చేయించి అన్ స్టాపబుల్ షోకు తీసుకొచ్చారని బోగట్టా.

ప్రభాస్ పెళ్లి గురించి కూడా ఈ షోలో రివీల్ చేయనున్నారని సమాచారం.ప్రభాస్ గోపీచంద్ ఎపిసోడ్ ఈ శుక్రవారం స్ట్రీమింగ్ అవుతుందా? లేక నూతన సంవత్సరం కానుకగా స్ట్రీమింగ్ అవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.

డ్రై హెయిర్ ను రిపేర్ చేసే బెస్ట్ రెమెడీ మీకోసం!