ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో వచ్చే సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ…

ప్రస్తుతం ఇండియాలో ఉన్న హీరోలందరిలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న ఒకే ఒక్క నటుడు ప్రభాస్( Prabhas ).

ఇక రీసెంట్ గా ఈయన చేసిన 'కల్కి ' సినిమా( Kalki 2898 AD ) సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఆయన సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఇక ఈ సినిమా యుద్ధ నేపథ్యంలో ఉండబోతున్న విషయం మనకు తెలిసిందే. """/" / ఇక హను రాఘవపూడి( Hanu Raghavapudi ) ఇంతకుముందు తీసిన సీతారామం సినిమా కూడా యుద్ధ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కింది.

అయితే ఈ సినిమా మాదిరిగానే ప్రభాస్ తో చేయబోయే సినిమా కూడా అలాగే ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

అయితే హను రాఘవపూడి ఈ సినిమాకి 'ఫౌజీ ' అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టాడు.

ఇక సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ సినిమా టైటిల్ ని మార్చుతామని చెప్తున్నప్పటికీ వర్కింగ్ టైటిల్ గా మాత్రం ఇప్పుడు ఈ టైటిల్ ని కొనసాగిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే హను రాఘవపూడి ఈ సినిమాలో హీరోయిన్ గా పాకిస్తాన్ కు చెందిన 'సజల్ అలీ(Sajal Ali )' ని తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

"""/" / కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక హాలీవుడ్ బ్యూటీ ని తీసుకురావాలని ఉద్దేశ్యం లో డైరెక్టర్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం హను రాఘవపూడి ఆ హీరోయిన్ తో చర్చలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాను అనుకున్న రేంజ్ కంటే భారీ రేంజ్ లో తెరకెక్కించాలని హను రాఘవపూడి భావిస్తున్నాడట.

ఇక దానికోసమే ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు వెళ్తున్నాడు.

ఖతార్ ఆధీనంలో గురు గ్రంథ్ సాహిబ్ స్వరూప్స్.. జోక్యం చేసుకోండి , జైశంకర్‌కు బీజేపీ నేత లేఖ