సలార్ అప్డేట్ మళ్ళీ వాయిదా.. తీవ్ర నిరాశలో డార్లింగ్ ఫ్యాన్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ కొట్టలేక పోయాడు.

సాహో సినిమా మన దగ్గర విజయం సాధించక పోయిన బాలీవుడ్ లో కలెక్షన్స్ బాగానే రాబట్టింది.

అయితే ఇటీవలే రిలీజ్ అయినా రాధేశ్యామ్ కూడా హిట్ కొట్టలేక పోయింది.ఇలా ప్రభాస్ చేసిన రెండు సినిమాలు విజయం సాధించక పోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.అందులో 'సలార్' సినిమా ఒకటి.

కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రెసెంట్ ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచు కుంటున్నారు.

కెజిఎఫ్ భారీ విజయం సాధించడంతో సలార్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

"""/" / అయితే ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అందరు దీని కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా నుండి టీజర్ లేదా గ్లిమ్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ అప్డేట్ ఈ నెలలోనే రావాల్సి ఉందట. """/" / కానీ అనూహ్యంగా వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ అప్డేట్ జూన్ నెలలో ఇవ్వనున్నట్టు కొత్త బజ్ వినిపిస్తుంది.దీంతో ఫ్యాన్స్ మరింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు అప్పుడు అంటూ పోస్ట్ పోన్ చేయడంతో ఈ అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

ప్రెసెంట్ శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను ఈ ఏడాది నవంబర్ నాటికీ షూటింగ్ మొత్తం పూర్తి చేసి 2023 సమ్మర్ సీజన్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు నిర్మాతలు.

Pithani Balakrishna : జనసేన పార్టీకి పితాని బాలకృష్ణ గుడ్ బై..!