ఆ విషయంలో టెన్షన్ పడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్
TeluguStop.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా కేజీఎఫ్ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమా విడుదలకు సిద్ధం అయింది.
మరో రెండు వారాల్లో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన, చూస్తున్న సలార్ విడుదల అవ్వబోతున్న నేపథ్యం లో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.
హీరోయిన్ గా సలార్ లో శృతి హాసన్( Shruti Haasan ) నటిస్తున్న విషయం తెల్సిందే.
ఇక సలార్ సినిమా నుంచి ట్రైలర్ వచ్చేసింది.ట్రైలర్ ను చూసిన తర్వాత చాలా మంది సినిమా పై అంచనాలు పెంచేసుకుంటున్నారు.
"""/" / ట్రైలర్ ఏకంగా 150 మిలియన్ ల డిజిటల్ వ్యూస్ ని దక్కించుకున్న విషయం తెల్సిందే.
అయితే ఇప్పటి వరకు సలార్ నుంచి పాటలు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.ఇంతకు సలార్ సినిమా లో పాటలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సలార్ లో పాటలు ఉండి ఉంటే ఇప్పటి వరకు విడుదల చేయాలి కదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
కేజీఎఫ్ రెండు పార్ట్ ల్లో కూడా పాటలు ఉన్నాయి. """/" /
ఆ పాటలు సినిమా కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
కానీ సలార్ లో మాత్రం పాటలు ఉన్న దాఖలాలు కనిపించడం లేదు.పాటలు ఉంటేనే ఒక పక్కా కమర్షియల్ మూవీ అన్న ఫీల్ ప్రేక్షకులకు కలుగుతుంది అనడంలో సందేహం లేదు.
అలాంటిది సలార్( Salaar ) లో పాటలు లేకుంటే పరిస్థితి ఏంటి అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ మరియు శృతి హాసన్ కాంబో లో ఒక్క రొమాంటిక్ లేదా లవ్ సాంగ్ ఉన్నా బాగుండేది కదా అంటూ కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ గత చిత్రాల నేపథ్యం లో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్న విషయం తెల్సిందే.
మీడియా ముందుకు వస్తే తప్ప ఇచ్చిన మాట గుర్తు లేదా దేవర.. ఎన్టీఆర్ సాయం పై విమర్శలు!