ప్రభాస్‌, మారుతి సినిమా గురించి అవి కేవలం పుకార్లు మాత్రమే

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఆదిపురుష్ సినిమా యొక్క విడుదల తేదీ విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరో వైపు సలార్‌ సినిమా యొక్క షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా యొక్క షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది.

ఇక మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్‌ కే సినిమా షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నాడు.

ఇన్ని సినిమాలు ఉండగా మరో వైపు మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను ప్రభాస్ చేయబోతున్నట్లుగా తెల్సిందే.

మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి అయ్యింది.వెంటనే రెండవ షెడ్యూల్‌ ప్రారంభించాల్సి ఉన్నా కూడా ఇతర సినిమాల యొక్క షూటింగ్స్ ఉండటం వల్ల వాయిదా వేయడం జరిగింది.

"""/"/ ప్రభాస్ మరియు మారుతి కాంబో మూవీ షూటింగ్‌ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం అవ్వాల్సి ఉంది.

కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది.ఇప్పటి వరకు మారుతి మరియు ప్రభాస్ సినిమా యొక్క షూటింగ్‌ అధికారికంగా ప్రకటన రాలేదు.

ప్రభాస్ యొక్క షూటింగ్‌ ఆయన జ్వరం కారణంగా క్యాన్సిల్‌ అయ్యిందని. """/"/ మారుతి ప్రస్తుతం ఊరికే ఉన్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభాస్‌ మరియు మారుతి కాంబో మూవీ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

జ్వరం కారణంగా షూటింగ్ కాస్త ఆలస్యం అయ్యిందే కానీ పూర్తిగా వాయిదా పడటం కానీ క్యాన్సిల్‌ అవ్వడం కానీ జరగలేదు అంటూ ప్రచారం జరుగుతోంది.

అతి త్వరలోనే ఈ సినిమా అప్డేట్‌ వచ్చే అవకాశం ఉంది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ లో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

పోలీసుల విచారణకు బండి భగీరథ్ డుమ్మా…!