Prabhas : మారుతి ప్రభాస్ సినిమా అప్డేట్.. చాలా గ్యాప్ తర్వాత అలాంటి పాత్రలో నటించనున్న ప్రభాస్?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం చేతినిండా 4,5 పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు హీరో ప్రభాస్.

ఈ నేపథ్యంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో మారుతీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా కూడా ఒకటి.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే.ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

"""/" / కాగా డైరెక్టర్ మారుతి( Maruti ) కామెడీని పండించడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ని రూపొందించుకున్నారు.

తన సినిమాలతో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ ఉంటారు.ఇది ఇలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ తో రూపొందిస్తున్న సినిమాలో కూడా ప్రభాస్ తో కూడా కామెడీ పండించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్నది హారర్ జోనర్ సినిమా అయినప్పటికీ ఎప్పటిలాగే సినిమాలో ఫన్ మాత్రం మిస్ చేయరు అని తెలుస్తోంది.

కాగా ప్రభాస్ గతంలో బుజ్జిగాడు, డార్లింగ్( Bujjigadu , Darling ) సినిమాల సమయంలో కామెడీ చేసి ప్రేక్షకులను నవ్వించిన విషయం తెలిసిందే.

"""/" / ఆ తర్వాత అన్నీ కూడా సీరియస్ రోల్స్ చేస్తూ వచ్చాడు.

కామెడీ తరహా పాత్రలలో ప్రభాస్ నటించిన చాలా కాలం అయ్యిందని చెప్పవచ్చు.దీంతో ప్రభాస్ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో చేయబోతున్నట్టు తెలుస్తోంది.

కాగా ఇందులో ప్రభాస్ సరసన మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాలో మాళవిక మోహన్ ప్రభాస్ లవ్ ట్రాక్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉండబోతోందట.

ఇటీవ‌ల అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ప్ర‌త్యేకంగా తీర్చిదిద్ద‌న ఒక సెట్లో ప్ర‌భాస్,మాళ‌విక‌ల ల‌వ్ ట్రాక్‌ని తెర‌కెక్కించారు.

వారిద్ద‌రి మ‌ధ్య తెర‌కెక్కించిన సీన్లు చాలా బాగా వ‌చ్చాయ‌ని, ఈ ట్రాక్ హిలేరియ‌స్‌గా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది.

వైరల్ వీడియో: ఏంటి బ్రో హీరోను పుసుక్కున అంత మాటనేశావ్..