బాబోయ్.. మా వల్ల కాదు గ్యాప్ ఇవ్వండి అంటున్న ప్రభాస్ ఫ్యాన్స్‌

ప్రభాస్ వరుస సినిమాలతో ఆయన అభిమానులు కనీసం ఊపిరి కూడా తీసుకోలేనంతగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బాహుబలి కోసం దాదాపు 5 సంవత్సరాల సమయం కేటాయించిన ప్రభాస్( Young Rebel Star Prabhas ) ఆ తర్వాత వచ్చిన సాహో సినిమాకు మూడు సంవత్సరాలు రాధేశ్యామ్ సినిమాకి రెండు సంవత్సరాలు సమయం కేటాయించాడు.

అలా సంవత్సరానికి కనీసం ఒక్క సినిమా కూడా చేయని ప్రభాస్ ఇప్పుడు ఏకంగా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేందుకు సిద్ధమవ్వడం జరిగింది.

ఒక వైపు సినిమాలు విడుదలవుతున్నాయి.మరో వైపు సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి, ఇదే సమయంలో కొత్త సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి అంటూ వస్తున్న వార్తలు ప్రభాస్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

"""/"/ ప్రభాస్ ఇన్ని సినిమాలు చేస్తున్న ఈ సమయంలోనే తమిళ ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్( Director Lokesh Kanagaraj ) దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అసలైన పాన్ ఇండియా మూవీగా నిలుస్తుంది అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విక్రమ్ సినిమా( Vikram Movie )తో యూనివర్సల్ స్టార్ కి దశాబ్ద కాలం తర్వాత సక్సెస్ దక్కేలా చేశాడు.

ప్రస్తుతం విజయ్ హీరోగా ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసింది.ఆ తర్వాత కమల్ హాసన్ తో లోకేష్ సినిమా ఉంటుంది.

"""/"/ ఆ తర్వాత ప్రభాస్ హీరోగా సినిమా రూపొందే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది.

తమిళ దర్శకులు దాదాపు అందరూ కూడా తెలుగు హీరోలతో సినిమాలు చేయాలని ఆశ పడుతున్నారు.

అదే దారిలో విక్రమ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ప్రభాస్ ని ఒక్కసారైనా డైరెక్ట్ చేయాలని ఆశ పడుతున్నట్లుగా తెలుస్తోంది.

అందుకే ఎంతో మంది స్టార్ హీరోలు ఆఫర్ ఇచ్చిన కూడా ప్రభాస్ వైపు లోకేష్ కనకరాజ్‌ చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రభాస్ ఇటీవలే ఆదిపురుష్ సినిమా( Adipurush Movie ) తో వచ్చిన విషయం తెల్సిందే.

ఆ సినిమా నిరాశ పర్చినా కూడా ప్రభాస్ జోరు మామూలుగా లేదు.

మహా కుంభమేళాలో హల్చల్ చేసిన నకిలీ షేక్.. ఉతికారేసిన సాధువులు