ప్రభాస్ బర్త్‌డే.. ఆ మూవీ గురించి క్లారిటీ వచ్చే అవకాశం
TeluguStop.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్.
బాహుబలి తర్వాత ఆయన స్థాయి ఏ స్థాయి లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
హీరో గా ప్రభాస్ ఉన్నత స్థాయికి ఎదిగిన తీరు ను ఎంతో మంది యంగ్ హీరో లు ఆదర్శంగా తీసుకున్నారు అనడం లో సందేహం లేదు.
ప్రభాస్ వేసిన దారి లో ఎంతో మంది హీరో లు నడుస్తున్నారు.అలాంటి గొప్ప స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు( Prabhas Birthday ) నేడు.
ఈ సందర్భంగా ఆయన నటించిన.నటిస్తున్న.
నటించబోతున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో సోషల్ మీడియా ఫుల్ గా నిండి పోయింది.
"""/" /
ఇన్ని సినిమా ల మధ్య ప్రభాస్ అభిమానులను ఊరిస్తున్న హను రాఘవపూడి( Hanu Raghavapudi ) కాంబో మూవీ గురించి క్లారిటీ వస్తుందని అంటున్నారు.
వైజయంతి మూవీస్ వారు ఈ సినిమా ను భారీ ఎత్తున నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారు.
వచ్చే ఏడాది ఆరంభం లోనే సినిమా ను మొదలు పెట్టబోతున్నారు.కనుక ఇదే సరైన సమయం అన్నట్లుగా ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు.
"""/" /
దసరా పండుగ మరియు ప్రభాస్ బర్త్ డే రెండు కలిసి రావడం తో కచ్చితంగా ప్రభాస్ కి ఇది ఒక మంచి ప్రాజెక్ట్ గా నిలుస్తుందనే ఉద్దేశ్యం తో ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు అంటూ సమాచారం అందుతోంది.
సీతారామం( Sita Ramam ) వంటి డీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా అవ్వడం తో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అనే నమ్మకం ను ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఆ రేంజ్ లో సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలి అంటే వచ్చే ఏడాది సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.