కొత్త సినిమా ప్రారంభించిన ప్రభాస్.. ఘనంగా పూజా కార్యక్రమాలు పూర్తి!

కల్కి సినిమా( Kalki Movie ) ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్( Prabhas ) అనంతరం తన తదుపరి సినిమాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు.

ఇప్పటికే కల్కి 2, సలార్ 2, స్పిరిట్, రాజా సాబ్ వంటి సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్న ప్రభాస్ తాజాగా మరో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు.

ఈయన సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి( Hanu Raghavpudi ) డైరెక్షన్ లో కొత్త సినిమా చేయబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరిగాయి.

"""/" / పలువురు సినీ సెలబ్రిటీల సమక్షంలో ఈ పూజా కార్యక్రమాలు( Pooja Ceremony ) జరిగాయి.

తాజాగా ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను మైత్రి మూవీ మేకర్స్ వారు తమ అధికారక ఖాతా నుంచి షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలన్నింటిని కూడా వెల్లడించనున్నారు.

"""/" / ఇక ఈ సినిమాకు ఫౌజి( Fauji ) అనే టైటిల్ కూడా పెట్టాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం అయితే ఈ సినిమా టైటిల్ గురించి ఇంకా ఎలాంటి ప్రకటన తెలియలేదు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటి మృణాల్ ఠాకూర్ నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలను ఆమె పూర్తిగా ఖండించారు.

మీ ఊహాగానాలకు పులి స్టాప్ పెడుతున్నందుకు నన్ను క్షమించండి నేను ఈ ప్రాజెక్టులో భాగం కాలేదు అంటూ ఈమె క్లారిటీ ఇవ్వడంతో మరి ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ ఎవరు అందుకున్నారు అనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది.

అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను మేకర్స్ వెల్లడించనున్నారు.

నైట్ డిన్నర్ తర్వాత ఈ నియమాలు పాటిస్తే సులభంగా బరువు తగ్గొచ్చు!