ఆ స్పెషల్ రోజునే ‘కల్కి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ''కల్కి 2898 AD( Kalki 2898 AD )''.

పాన్ వరల్డ్ మూవీగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ వంటి స్టార్స్ భాగం అవ్వడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది.

"""/" / ఇటీవలే ఇంటర్నేషనల్ వేదికపై ఈ సినిమా టైటిల్ అండ్ గ్లింప్స్ రిలీజ్ చేసారు.

దీంతో ఇది అప్పుడే పాన్ వరల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంది.అన్ని ఇండస్ట్రీల వారు ఎదురు చూస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రావాల్సి ఉంది.

కానీ సినిమా పనులు పూర్తి అయ్యే ఛాన్స్ లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇటీవలే తెలిపారు.

దీంతో ఫ్యాన్స్ అంతా కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం షూట్ పూర్తి అయిన పోర్షన్ కు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే మళ్ళీ భారీ యాక్షన్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు.

అయితే రిలీజ్ డేట్ గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది.

ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీ దత్( Aswani Dutt ) నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

"""/" / మరి వైజయంతీ మూవీస్( Vyjayanthi Movies ) వారు తెరకెక్కించిన సినిమాలు మే 9న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి.

అందులో జగదేకవీరుడు అతిలోక సుందరి, కంత్రి, మహర్షి, మహానటి వంటి సినిమాలు ఆ రోజు రిలీజ్ విజయం సాధించగా ఈ స్పెషల్ డే రోజునే కల్కి సినిమా రిలీజ్ కూడా ఫిక్స్ చేసినట్టు టాక్ గట్టిగానే వినిపిస్తుంది.

అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉందట.

చెక్‌బౌన్స్‌ కేసులో రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష