వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు చూసిన టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్?
TeluguStop.com
సంక్రాంతి పండుగ సంబరాలు మొదలయ్యాయి.దీంతో సంక్రాంతి పండుగ కానుకగా బాలయ్య బాబు నటించిన వీర సింహారెడ్డి,చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
బాలయ్య బాబు నటించిన నరసింహారెడ్డి సినిమా జనవరి 12న విడుదల కాగా, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13న విడుదల అయింది.
దీంతో మెగా అభిమానులు అలాగే నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.థియేటర్ల వద్ద అయితే అప్పుడే పండుగ వాతావరణం నెలకొంది.
"""/"/
అయితే ఈ రెండు సినిమాలు విడుదల అయ్యి మంచి సక్సెస్ను సాధించడంతో అభిమానులు థియేటర్ల వద్దకి క్యూలు కడుతున్నారు.
ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫోటో పోటీగా ఆడుతూ కలెక్షన్లు సాధిస్తుండడంతో అభిమానులు ప్రేక్షకులు కూడా పోటాపోటీగా సినిమా థియేటర్లకు ఎగబడి వస్తున్నారు.
అయితే బాలయ్య బాబు సినిమా విడుదల అయ్యి రెండు రోజులు అవుతున్న విషయం తెలిసిందే.
ఈ రెండు సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల కావడంతో సామాన్యులతో పాటుగా సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను చూడడానికి సినిమా థియేటర్లకు వెళ్లారు.
"""/"/
ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ అయిన ప్రభాస్, అల్లు అర్జున్ వీర సింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమాలు చూడడానికి థియేటర్ కి వచ్చారు.
ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ ఏఎంబి సినిమాస్లో వీర సింహారెడ్డి సినిమాను చూడగా ప్రసాద్ మల్టీప్లెక్స్ లో అల్లు అర్జున్ వాల్తేరు వీరయ్య సినిమాను చూశారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ అలాగే అల్లు అర్జున్ సినిమాలకు వెళ్లిన ఫొటోస్ కూడా చూసిన మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే ఎన్నో సంక్రాంతి పండుగలకు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి పోటీపడిన బాలయ్య బాబు, చిరంజీవి తాజాగా మరొకసారి పోటీపడి ఇద్దరు సక్సెస్ ను సాధించారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి12, ఆదివారం 2025