ఆదిపురుష్ కోసం ప్రభాస్ ఎన్ని రోజులు కేటాయించాడో తెలుసా?
TeluguStop.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమా పూర్తి కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడు.
ఇప్పటికే మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తన 21వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు.
కాగా ఈ సినిమాను పూర్తి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఇక ఈ సినిమా తరువాత మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రభాస్ సిద్ధమయ్యాడు.బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే సినిమాలో నటించేందుకు ప్రభాస్ ఓకే చెప్పాడు.
ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు.
ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ కేవలం 60 రోజుల డేట్లు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సినిమాను మెజారిటీ శాతం వీఎఫ్ఎక్స్‌లో తెరకెక్కించనుండటంతో ఈ సినిమాకు అంత తక్కువ డేట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.
అటు ఈ సినిమా బడ్జెట్ కూడా అందరూ అనుకుంటున్నట్లుగా భారీగా కాకుండా పరిమిత బడ్జెట్‌తోనే ఈ సినిమాను పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.
వీఎఫ్ఎక్స్ పనులను హాలీవుడ్‌కు చెందిన కంపెనీకి కాకుండా ముంబైకి చెందిన ఓ వీఎఫ్ఎక్స్ స్టూడియోకు అప్పగించినట్లు తెలుస్తోంది.
దీంతో ఆదిపురుష్ ఎవ్వరి ఊహలకు అందకుండా దూసుకెళ్లనుంది.ఇక ఈ సినిమాలో భారీ తారాగణం ఉండనుంది.
కాగా ఈ సినిమాలో లంకేశ్వరుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. డైరెక్టర్ శంకర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!