24 గంటల్లో రికార్డ్స్ సృష్టించిన ఆది పురుష్ ట్రైలర్!
TeluguStop.com
ప్రభాస్(Prabhas), కృతి సనన్ (Kriti Sanon)హీరో హీరోయిన్లు నటిస్తున్నటువంటి తాజా చిత్రం ఆది పురుష్.
( Adipurush ) ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ వీడియో విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతుంది.రామాయణం ఇతిహాసం నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ క్రమంలోని ఈ సినిమా నుంచి గతంలో టీజర్ విడుదల చేశారు తాజాగా ట్రైలర్ కూడా విడుదలైంది.
"""/" /
టీజర్ విడుదల చేసిన సమయంలో ఈ సినిమాపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ సినిమాలో గ్రాఫిక్స్ చాలా ఘోరంగా ఉన్నాయని ఈ సినిమా కన్నా పిల్లలు చూసే కార్టూన్ చానెల్ చాలా బాగుంటుంది అంటూ ఎన్నో రకాల విమర్శలు వినిపించాయి.
ట్రైలర్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.టీజర్ కన్నా ట్రైలర్ 100% బాగుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలన్నింటిని కూడా చూపించారు.
ఇక ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్ నటించగా, సీత పాత్రలో కృతి సనన్ నటించారు.
ఇలా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానుంది """/" /
ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ 24 గంటలలో అత్యధిక స్థాయిలో వ్యూస్ లైక్స్ సొంతం చేసుకుని సరికొత్త రికార్డులను సృష్టించింది.
తెలుగు ఇప్పటికే 11 మిలియన్లకు పైగా వ్యూస్ + 551.8K లైక్స్ వచ్చాయి.
ఇక తెలుగు 2లో 3.19M వ్యూస్ 244.
1K లైక్స్, హిందీ - 52.22M వ్యూస్ & 1.
09M లైక్స్, తమిళ్ - 3.13M వ్యూస్ 85.
9K లైక్స్, మలయాళం- 3.12M వ్యూస్ 66K లైక్స్, కన్నడ- 1.
76M వ్యూస్ 72K లైక్స్ వచ్చాయి.ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ట్రేడింగ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ పెద్ద ఎత్తున ప్రశంసలకు అందుకుంటుంది.
How Modern Technology Shapes The IGaming Experience