‘ఆదిపురుష్’ కి ఈ ప్రీ పబ్లిసిటీ బాగా హెల్ప్ అవ్వడం ఖాయం
TeluguStop.com
ప్రభాస్( Prabhas ) హీరో గా నటించిన ఆదిపురుష్ సినిమా( Adipurush Movie ) ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కువగా చేయడం లేదు అంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్న సమయం లో విడుదలకు వారం రోజుల ముందు ఫ్రీ పబ్లిసిటీ భారీగానే లభిస్తుంది.
ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది.ఆ తర్వాత దర్శకుడు తిరుపతి( Tirupati ) కొండ పై హీరోయిన్ కి ముద్దు పెట్టడం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే.
దాంతో తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టీవీల్లో కొందరు ఈ విషయాన్ని నానా రాద్దాంతం చేస్తూ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ ఇస్తున్నారు.
మీడియాలో ప్రధానంగా ఈ విషయమై చర్చ జరుగుతోంది. """/" /
ఆ కారణంగా సినిమా కు ఉచితం గా పబ్లిసిటీ లభించినట్లు అయ్యింది.
అంతే కాకుండా ఈ సినిమా ఆడే ప్రతి థియేటర్ లో కూడా ఒక సీటు ను హనుమంతుడి కోసం ఇవ్వాలంటూ దర్శకుడు రిక్వెస్ట్ చేయడం.
అది కాస్త సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం తో ఉచితంగా పబ్లిసిటీ లభించినట్లు అయ్యింది.
ఈ విషయాన్ని కొందరు పాజిటివ్ గా మాట్లాడుకుంటూ ఉంటే మరి కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.
థియేటర్ కు చెప్పులు వేసుకుని వెళ్లవద్దని.దళితులకు అనుమతి లేదు అంటూ రకరకాలుగా తప్పుడు ప్రచారం జరుగుతుంది.
వాటి వల్ల కూడా పబ్లిసిటీ దక్కింది.ఇక మరో విషయం ఏంటంటే ఈ సినిమా ను నైజాం లో పంపిణీ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ """/" /
ఏకంగా 10,000 టికెట్లను ఉచితంగా అనాధలకు ప్రభుత్వ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు.
దీంతో సినిమా లో కావలసినంత ప్రీ పబ్లిసిటీ లభించినట్లు అయిందని సినీ విశ్లేషకులు అభిప్రాయం అర్థం చేస్తున్నారు.
ఇదే స్థాయిలో సినిమా గురించి ఏదో ఒక వివాదం లేదంటే పాజిటివ్ గా మాట్లాడుకునే టాపిక్ లభిస్తే చాలు కచ్చితంగా ముందు ముందు పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి జనాల్లో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.
అదే జరిగితే మొదటి మూడు రోజులు కలెక్షన్స్ విపరీతంగా నమోదయ్యే అవకాశం ఉంది.
కనుక భారీ ఎత్తున సినిమా సూపర్ హిట్ టాక్ దక్కించుకుని రూ.1000 కోట్లగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.
మోహన్ బాబు తన కొడుకుల విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నాడు…