కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఆదిపురుష్ సినిమా ఇంకా బాగుండేది…
TeluguStop.com
ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆదిపురుష్ సినిమా( Adipurush Movie ) గురించే డిస్కషన్ జరుగుతుంది.
రామాయణ ఇతివృత్తంతో ప్రభాస్ ( Prabhas ) రాముడి పాత్రలో నటించిన చిత్రం ఆదిపురుష్.
తానాజీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఓం రౌత్( Om Raut ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తొలుత గ్రాఫిక్స్ విషయంలో కాస్త నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.
ఆ తర్వాత విడుదలైన పాటలు, ట్రైలర్స్ సినిమా మీద విశేషమైన బజ్ క్రియేట్ చేశాయి.
పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ.ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండా రిలీజైన ఆదిపురుష్ ఆడియన్స్ ముందుకు వచ్చింది .
ఐతే సినిమా ఫలితం పట్ల మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది .విజువల్ సూపర్ అంటున్నారు .
కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు .రాఘవుడిగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ , స్క్రీన్ ప్రెజన్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడం ఖాయం అంటున్నారు .
లుక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే ఇంకా బాగుండేదన్న టాక్ వినిపిస్తుంది .
"""/" /
ఇక జానకీ దేవిగా కృతి సనన్( Kriti Sanon ) బాగా సెట్ అయ్యిందని సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెబుతున్నారు .
ఆమె కళ్ళలో బాధ, ఆమె ముఖంలో హావభావాలు చక్కగా పండాయి.నెగిటివిటీకి తావు లేకుండా ఆమె పాత్రను పోషించింది.
కాకపోతే.ఆమె కాస్ట్యూమ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సిందనే టాక్ వినిపిస్తుంది .
అలాగే .సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ అంటే కథనమే అనేది ఆడియెన్స్ మాట .
ఈ సినిమా చూస్తున్నంత సేపూ తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోతూ ఉంటుంది.ఈ విషయంలో కాస్త శ్రద్ద తీసుకొని ఉంటె బాగుండేది .
అలాగే సినిమాలో పాత్రల గెటప్ లు అండ్ సెటప్ కూడా తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కావు.
దర్శకుడు ఓం రౌత్ 3డి విజువల్స్ మీద పెట్టినంత శ్రద్ద కథాకథనాలు మీద పెట్టలేదనిపిస్తుంది.
ఆ విషయంలో కేర్ తీసుకొని ఉంటె బాగుండేది . """/" /
ఇక సినిమాలోని ఒక్కో సన్నివేశం విడిగా చూస్తే, ఆ సన్నివేశాలన్నీ పాత సినిమాల్లో చూసిన ఫీలింగే కలుగుతుంది.
దీనికి తోడు సినిమా మొత్తం నెమ్మదిగా సాగుతూ ఉండటం వల్ల.ప్రేక్షకులు కొంత అసహనానికి గురి అవుతారు.
ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను అనవసరంగా లాగ్ చేయడం వల్ల ఆ సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అయింది.
ఆయా సన్నివేశాలపై ఇంకా ఫోకస్ పెడితే బాగుండేది .ఇంకా స్క్రీన్ ప్లే మరింత ఆకర్షణీయంగా ఉంటూ .
ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉండి ఉంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది.అలాగే రావణుడి గెటప్ విషయంలోను కొంత చేంజెస్ చేస్తే బాగుండేదనిపిస్తుంది .
ఓటీటీలో దేవర రిజల్ట్ ఏంటి.. ఈ ప్రశ్నకు సులువుగానే జవాబు దొరికేసిందిగా!