ఆదిపురుష్ ఫస్ట్ లుక్ అప్‌డేట్.. దర్శకుడి క్లారిటీ
TeluguStop.com
ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వం లో రూపొందిన ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న విషయం తెల్సిందే.
సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం అభిమానులు గత ఏడాది కాలంగా వెయిట్ చేస్తున్నారు.
ప్రభాస్ ను రాముడు అంటున్నారు.కాని ఇది రామాయణం కాదు అంటున్నారు.
కనుక సినిమా మొత్తం కూడా ఎలా ఉంటుంది అంటూ అంతా ఆసక్తిగా ఉన్నారు.
సినిమా నుండి ఫస్ట్ లుక్ వస్తే ఒక స్పష్టత అనేది వస్తుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో సినిమా ఫస్ట్ లుక్ విడుదల అంటూ గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి.
హీరోయిన్ కృతి సనన్ బర్త్ డే సందర్బంగా హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు దర్శకుడు ఏర్పాట్లు చేస్తున్నాడు అంటూ ఎదురు చూశారు.
కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కృతి సనన్ ఫస్ట్ లుక్ వార్తలు కేవలం పుకార్లు మాత్రమ అంటూ దర్శకుడు ఓమ్ రౌత్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు.
ఆయన ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా పేర్కొన్నాడు.సినిమా ను అన్నట్లుగా నే వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
హీరో ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్ షూటింగ్ ను ముగించి సలార్ మరియు ప్రాజెక్ట్ కే సినిమా లు చేస్తున్నాడు.
ఈ సినిమా ను విడుదల చేసిన తర్వాతే ఆ సినిమా లు విడుదల అంటున్నారు.
కనుక వచ్చే ఏడాది సంక్రాంతికి ఆదిపురుష్ కచ్చితంగా విడుదల అవ్వాల్సి రావచ్చు.మరి సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.
ప్రభాస్ ను ఢీ కొట్టేందుకు ఈ సినిమా లో విలన్ గా అంటే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెల్సిందే.
1.5 కోట్ల రోబో గర్ల్‌ఫ్రెండ్.. మీ భార్య, గర్ల్‌ఫ్రెండ్ కంటే సుఖ పెడుతుందట..?