ఆదిపురుష్ : ఏప్రిల్ 10వ తారీకున ఏం జరుగబోతుందో తెలుసా?
TeluguStop.com
బాలీవుడ్ లో ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా కు సంబంధించిన అప్డేట్ ఒకటి ప్రస్తుతం ఆసక్తి ని రేకెత్తిస్తోంది.
ఇటీవలే విడుదల అయిన రాధేశ్యామ్ ప్రభాస్ అభిమానులకు షాక్ ఇచ్చింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా డిజాస్టర్గా నిలిచింది.
250 కోట్ల వసూళ్లను సాధించాల్సిన ఆ సినిమా కనీసం వంద కోట్ల వసూళ్ల ను కూడా రాబట్టలేక పోవడంతో నిర్మాతలు మరియు బయ్యర్లు తీవ్ర నష్టాలకు గురయ్యారు.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా డిజాస్టర్ గా నిలవడం ప్రభాస్ తదుపరి సినిమా ల విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఈ సమయం లో ప్రభాస్ హీరో గా తెరకెక్కిన ఆది పురుష్‌సినిమా కు సంబంధించిన చర్చ ప్రస్తుతం సోషల్ మీడియా లో జోరుగా సాగుతోంది.
కొన్ని నెలల క్రితమే ఈ సినిమా కు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయినట్లుగా అధికారికంగా ప్రకటించారు.
"""/"/
ఈ సినిమా ను వచ్చే ఏడాది జనవరి లో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికం గా ప్రకటించారు.
సినిమా ప్రకటించి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు సినిమా కు సంబంధించి ఎటువంటి ఫస్ట్ లుక్ ను విడుదల చేయలేదు.
ఎట్టకేలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్లు గా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
ఫస్ట్ లుక్ కచ్చితంగా ప్రభాస్ అభిమానులకు సర్ ప్రైజింగ్ గా ఉంటుందని ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏప్రిల్ 10వ తారీఖున ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాబోతున్న నేపథ్యం లో అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
దాదాపు అయిదు వందల కోట్ల బడ్జెట్తో ఈ సినిమా ను దర్శకుడు తెరకెక్కించాడు అనేది టాక్.
రెండు వందల కోట్ల కు పైగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు ఖర్చు చేస్తున్నారు.
గ్రాఫిక్స్ పూర్తిగా అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీం తో నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.సినిమా షూటింగ్ పూర్తి గా గ్రీన్ మ్యాట్ పై చిత్రీకరించారు.
కనుక సినిమా విజువల్ వండర్ గా ఉండబోతోందని సమాచారం అందుతోంది.
కాలు కడుక్కోవడానికి వెళ్తే.. మొసలి కడుపులోకి.. ఇండోనేషియాలో భయానక ఘటన!