ఈశ్వర్ కి సాహోకి నడుమ ప్రభాస్ రిజెక్ట్ చేసిన 9 సినిమాలు!
TeluguStop.com
ప్రభాస్.ఇండియన్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అవసరం లేని పేరు.
ఈశ్వర్ తో మొదలైన ఆయన సినీ జర్నీ.ఛత్రపతితో స్టార్ హీరోగా ఎదిగాడు.
బాహుబలితో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరాడు.ఇండియన్ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందాడు.
ఈ ప్రయాణంలోనే ఆయన ఎన్నో సినిమాలను వదులుకున్నాడు.అందులో కొన్ని కథలు నచ్చక రిజెక్ట్ చేయగా.
మరికొన్ని డేట్స్ కుదరక ఒప్పుకోలేదు.ఇంతకీ ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!
H3 Class=subheader-styleదిల్:/h3p """/"/
వివి వినాయక్ దిల్ కథని మొదట ప్రభాస్ కి చెప్పాడట.
కానీ పెదనాన్న కృష్ణంరాజు సలహాతో ప్రబాస్ వదులుకున్నాడట.ఆ తర్వాత ఇదే కథ ఎన్టీఆర్ కి వినిపించాడు వినాయక్.
ఆయన కూడా కొన్ని కారణాలతో వద్దనుకున్నాడు.చివరకు నితిన్ తో చేసాడు.
ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.h3 Class=subheader-styleసింహాద్రి:/h3p """/"/
రాజమౌళి సింహాద్రి కథని మొదట ప్రభాస్ తో చేయాలనుకున్నాడు.
కానీ సింహాద్రి లాంటి మాస్ స్టోరీని చేయగలడా అనే డౌట్ తో ప్రభాస్ రాజమౌళి కి నో చెప్పాడట.
ఈ సినిమా ఎన్టీఆర్ తో చేసి సూపర్ హిట్ కొట్టాక.రాజమౌళితో ఎలాగైనా సినిమా చేయాలని భావించాడట ప్రభాస్ .
H3 Class=subheader-styleఆర్య:/h3p """/"/
సుకుమార్ డైరెక్షన్లో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా చేసిన సినిమా ఆర్య.
ఈ కథను ప్రభాస్ కు కూడా వినిపించాడట డైరక్టర్.కానీ కథ విన్న ప్రభాస్ తనకు నచ్చలేదని చెప్పాడట.
H3 Class=subheader-styleకిక్:/h3p """/"/
రవితేజ చేసిన సూపర్ మూమీ కిక్ సినిమా కథని.ముందుగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రభాస్ కి చెప్పాడు.
కథ నచ్చింది కానీ హీరో క్యారెక్టర్ తనకు సెట్ కాదని చెప్పాడట ప్రభాస్.
H3 Class=subheader-styleబృందావనం:/h3p """/"/
ప్రభాస్ తో మున్నా సినిమా చేసిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన తర్వాత కథని కూడా ప్రభాస్ తో చేయాలనుకున్నాడట.
కొరటాల శివతో కలిసి వెళ్లి కథ చెప్పాడట.కానీ డేట్స్ కుదరక ఈ సినిమాను వదులుకున్నాడు.
H3 Class=subheader-styleడాన్ శ్రీను:/h3p """/"/
బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ నచ్చి గోపిచంద్ మలినేని దానిలాగే డాన్ శీను కథని రాసుకున్నాడట.
ప్రభాస్ కి ఈ మూవీ చేయాలని ఉన్నా డేట్స్ కుదరక నో చెప్పాడట.
H3 Class=subheader-styleనాయక్:/h3p """/"/
ప్రభాస్ తో చేసిన యోగి సినిమా ప్లాప్ అవడంతో మళ్ళీ ఎలాగైనా ప్రభాస్ కి హిట్ ఇవ్వాలని వివి వినాయక్ అనుకున్నాడట.
నాయక్ కథను ప్రభాస్ కు చెప్పాడట.కథ అంతగా నచ్చని ప్రభాస్ ఈ మూవీకి నో చెప్పాడట.
H3 Class=subheader-styleరన్ రాజా రన్:/h3p """/"/
కేవలం ప్రభాస్ కోసమే ఈ సినిమా స్టోరీ రాశాడు డైరెక్టర్ సుజిత్.
అప్పటికే బాహుబలి లాంటి పెద్ద ప్రాజెక్ట్ కు ఫిక్స్ అయిన ప్రభాస్ ఈ కథని శర్వానంద్ తో చేయమని సుజిత్ కు సలహా ఇచ్చాడట.
H3 Class=subheader-styleజిల్:/h3p """/"/
డైరెక్టర్ రాధా క్రిష్ణ జిల్ సినిమా కథ ప్రభాస్ కు ముందుగా చెప్పాడట.
బాహుబలి కారణంగా కుదరదని చెప్పిన ఆయన గోపిచంద్ ఈ కథకి బాగా సెట్ అవుతాడని చెప్పాడట.