లాక్‌డౌన్ వేళ కథ మార్చిన ప్రభాస్
TeluguStop.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాతో మరోసారి యంగ్ రెబల్ స్టార్ తనదైన మార్క్ వదిలేందుకు రెడీ అవుతున్నాడు.
జిల్ చిత్రంతో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న రాధాకృష్ణ ఈ సినిమాతోనూ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.
కాగా ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే అంశాన్ని టాప్ సీక్రెట్‌గా పెట్టారు చిత్ర యూనిట్.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్‌డేట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా ఇప్పట్లో పూర్తయ్యేలా లేదని తెలుస్తోంది.లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను ఫారిన్ లొకేషన్‌ల నుండి ఇండియాకు షిఫ్ట్ చేశారు చిత్ర యూనిట్.
ఈ క్రమంలోనే ఫారిన్‌లో జరగాల్సిన షూటింగ్‌కు సంబంధించిన పనులన్నింటినీ రాధాకృష్ణ ఇక్కడి నేటివిటీకి సరిపోయే విధంగా అడ్జెస్ట్ చేశారని తెలుస్తోంది.
నేటి యంగ్ జనరేషన్‌ను నాటి టీమ్ ఎలా హ్యాండిల్ చేశారనేది ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే.
బడ్జెట్ 7 కోట్లు.. కలెక్షన్లు 75 కోట్లు.. ఈ హిట్ మూవీ ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే!