అవినాష్ రెడ్డి వ్యవహారంలో సీబీఐ తీరుపై చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు..!!

టీడీపీ నేత దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ఏలూరు విద్యుత్ భవన్ ఎదుట చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ధర్నా చేపట్టడం జరిగింది.

ఈ ధర్నాలో పాల్గొన్న చింతమనేని విద్యుత్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు.పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉందని చింతమనేని ఆరోపణలు చేశారు.

ఈ ధోరణి వల్లే వైయస్ అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ అధికారులు కఠిన వైఖరి అవలంబించలేకపోతున్నారని పేర్కొన్నారు.

సీబీఐ అధికారులను సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy)బెదిరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.వైయస్ వివేకా హత్య కేసులో నేరస్తుడిని అరెస్టు చేయకపోవడం సిగ్గుచేటు అని చింతమనేని అసహనం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డికి మరో మారు చుక్కెదురైంది.

అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపగా.

ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని సుప్రీం ధర్మాసనం అవినాష్ రెడ్డికి సూచించింది.

ఈ మేరకు ఈనెల 25వ తేదీన విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఇదే సమయంలో హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తయ్య వరకు తనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని.

సీబీఐనీ ఆదేశించాలనే అవినాష్ రెడ్డి చేసిన అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది.

వీడియో వైరల్‌: మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన టీమిండియా క్రికెటర్‌