విజయ్ దేవరకొండ టాలెంట్ ని మొదటగా నేనే గుర్తించాను, కానీ నన్ను కాదన్నారు: ప్రభాకర్

ప్రముఖ సీరియల్ నటుడు ప్రభాకర్( Actor Prabhakar ) గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

రామోజీరావు కాంపౌండ్ లో ప్రభాకర్ చాలా కీరోలు పోషించేవారు.అనేక సీరియల్ ద్వారా ఆయన అందరికీ సుపరిచితులు.

ఎంతలా అంటే, ఆయనని బుల్లితెరప్రాక్షకుడు ముద్దుగా బుల్లితెర మెగాస్టార్ అనే పిలుచుకునేవాడు.అంతలా ఆయన పలు సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించాడు.

"""/" / అయితే కొన్నాళ్లుగా ఆయన బుల్లి తెరకు దూరంగా ఉన్నాడు.అయితే తన కుమారుడుని సినిమాల్లోకి హీరోగా పరిచయం చేయడంతో మరల ప్రభాకర్ తెర మీదికి వచ్చాడు.

ఈ క్రమంలో ప్రభాకర్ పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.ఈ క్రమంలోనే ఓ మీడియా వేదికగా ప్రభాకర్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

దాంతో ఈ మాటలను రౌడీ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండ మొదటి సినిమా చూసిన ప్రభాకర్ విజయ్ నటనను చూసి ఫిదా అయిపోయాడట.

ఆ సినిమా మరేదో కాదు, ఎవడే సుబ్రహ్మణ్యం.( Yevade Subramanyam Movie ) """/" / ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను చూసిన ప్రభాకర్, గీత ఆర్ట్స్ వారి దగ్గరికి వెళ్లి విజయ్ దేవరకొండ గురించి మాట్లాడాడట.

కానీ అప్పుడు లైట్ తీసుకున్న గీత ఆర్ట్స్, తరువాతి రోజుల్లో విజయ్ దేవరకొండను పెట్టి గీత గోవిందం( Geetha Govindam ) అనే సినిమాను నిర్మించిన సంగతి చెప్పుకొచ్చారు ప్రభాకర్.

ఈ విషయం గురించి ప్రభాకర్ మాట్లాడుతూ."మనం ఏదైనా సాధించక మునుపు ఎవరైనా ఎంకరేజ్ చేస్తే, అదే నిజమైన సహాయం! అంతేగాని, మనం సక్సెస్ అయిన తర్వాత ఎవరైనా మనల్ని గుర్తిస్తారు!" అంటూ సదరు నిర్మాణ సంస్థ పైన ఘాటైన విమర్శలు పరోక్షంగా చేయడం జరిగింది.

హరీష్ శంకర్ నిర్మాత గా కిరణ్ అబ్బవరం సినిమా రాబోతుందా..?