ప్రభాస్ షూటింగ్‌ లో జాయిన్ అయ్యేది ఎప్పుడంటే..!

యంగ్ రెబెల్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కమిట్‌ అయిన విషయం తెలిసింది.

ఇప్పటికే ఆదిపురుష్‌ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ తదుపరి సలార్, ప్రాజెక్టు కే, స్పిరిట్ మరియు రాజా డీలక్స్ సినిమాలను చేయాల్సి ఉంది.

మొదటగా ప్రాజెక్టుకే మరియు సలార్ సినిమా షూటింగ్‌ లను ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది.

వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ రెండు సినిమాల షూటింగ్ చివరి దశకు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది.

ఈ ఏడాది చివరి వరకు ఈ రెండు సినిమాల్లో ఒక సినిమాను పూర్తి చేయాలని ప్రభాస్ భావించాడు.

కానీ పెదనాన్న కృష్ణంరాజు చనిపోవడంతో గత కొన్ని రోజులుగా షూటింగ్లకు పూర్తిగా దూరంగా ఉన్నాడు.

దాంతో ప్రభాస్ అనుకున్నట్లుగా ఈ ఏడాది షూటింగ్ లు పూర్తి చేసే పరిస్థితి లేదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ ప్రభాస్ ఎప్పుడు షూటింగ్ లకు జాయిన్ అవుతాడు అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ అక్టోబర్ రెండవ వారం నుండి షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడట.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోమని నిర్మాతలకు సూచించాడని సమాచారం అందుతుంది.పెదనాన్న మరణం నుండి తేలుకోలేకపోతున్నా ప్రభాస్ తనపై నిర్మాతలు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఉన్నారు కనుక వారికి అన్యాయం చేయలేను.

ఆ ఉద్దేశంతోనే సినిమా నిర్మాణం ఆలస్యం కావొద్దు అని ప్రభాస్ వచ్చే నెల నుండి షూటింగ్లలో పాల్గొనేందుకు ఓకే అన్నట్లుగా తెలుస్తోంది.

భారీ అంచనాల నడుమ రూపపోందుతున్న మారుతి రాజా డీలక్స్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా నవంబర్లో మొదలయ్యే అవకాశం ఉందని పుకార్లు షికారులు చేస్తున్నాయి.

ఆ విషయమై కూడా ప్రభాస్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఉద్యోగాన్ని వదిలి ఇతరుల ఇళ్లను ఉచితంగా శుభ్రం చేస్తున్న ‘కత్రినా’