ఫ్యాన్స్‌ రెడీనా.. 'వకీల్‌ సాబ్‌' ట్రైలర్‌ ముహూర్తం ఖరారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘వకీల్ సాబ్’’ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న తేదీకి అధికారికంగా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.దిల్ రాజు-శిరీష్ నిర్మించిన ఈ మూవీని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు.

ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది.థియేట్రికల్ ట్రైలర్ ను ఈ నెల 29న రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు మేకర్స్.

దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.లాయర్ గెటప్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్.

అభిమానులు ట్రైలర్ పోస్టర్ చూసి ఊగి పోతున్నారు.ఖచ్చితంగా ట్రైలర్‌ తో సినిమా అంచనాలు ఆకాశానికి తీసుకు వెళ్లడం ఖాయం అంటున్నారు.

పింక్ కు రీమేక్ గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.ఈ సినిమా పింక్ తరహాలో కాకుండా కాస్త కమర్షియల్‌ టచ్‌ ఇచ్చి రూపొందించడం జరిగింది.

"""/"/ ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ‘‘వకీల్ సాబ్’’ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.

ట్రైలర్ కూడా అంచనాలను మరింత పెంచేదిలా ఉంటుందని నమ్ముతున్నారు మేకర్స్.ఇప్పటికే మొదలైన ప్రమోషన్స్ సినిమా బజ్ ను పెంచేశాయి.

ట్రైలర్ కు కూడా డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేయబోతున్నారు.పవన్ కళ్యాణ్‌ కు జోడీగా ఈ సినిమా లో శృతి హాసన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.

పెద్ద మొత్తంలో ఈ సినిమా ను కొనుగోలు చేసేందుకు బయ్యర్లు సిద్దంగా ఉన్నారు.

ఇప్పటికే కొన్ని ఏరియాల్లో బిజినెస్ అవ్వగా మరి కొన్ని ఏరియాల్లో ట్రైలర్‌ విడుదల తర్వాత అమ్మేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

మొత్తానికి ఈ సినిమా మరో రేంజ్ లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ప్రస్తుతం సినిమా కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా లో కీలక పాత్రల్లో అంజలి, నివేథా థామస్‌ లు కనిపించబోతున్న విషయం తెల్సిందే.

వైరల్ అవుతున్న టర్కిష్ వ్లాగర్ దేశీ ఫుడ్ టూర్.. వీడియో చూస్తే ఫిదా..