కర్పూరాన్ని ఇలా కూడా వాడొచ్చని మీకు తెలుసా..?

కర్పూరం( Camphor ) గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.క‌ర్పూరం స్ఫటికాకారంగా లేదా నూనెలాగా ప్ర‌తి ఒక్క‌రికి దొరుకుతుంది.

హిందువులు తమ పూజా కార్యక్రమాల్లో దేవునికి హారతి ఇవ్వడానికి క‌ర్పూరాన్ని ప్ర‌ధానంగా ఉప‌యోగిస్తారు.

కర్పూరం వెలిగించందే పూజ పూర్తవదు.అలాగే సుగంధం గానూ, కొన్ని వంటకాల్లోనూ క‌ర్పూరాన్ని వాడ‌తారు.

అంతే కాదండోయ్ క‌ర్పూరంతో మరెన్నో లాభాలు ఉన్నాయి.బలమైన వాసన మరియు ఘాటైన రుచిని కలిగి ఉండే కర్పూరం మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.

"""/" / చాలామంది త‌ర‌చూ త‌ల నొప్పి( Headache )తో బాధపడుతూ ఉంటారు.

అలాంటివారు నెయ్యిలో కర్పూరం పొడి కలిపి నుదురుపై రాసుకోవాలి.ఇలా చేయడం వల్ల తలనొప్పి నుంచి చాలా వేగంగా ఉపశమనాన్ని పొందుతారు.

అలాగే చర్మంపై దద్దుర్లను నయం చేయడానికి కూడా కర్పూరం ఉపయోగపడుతుంది.అందుకోసం వాటర్ లో కర్పూర తైలాన్ని కలిపి దద్దుర్లు పై అప్లై చేసుకోవాలి.

ఇలా చేస్తే ద‌ద్దుర్లు మాయం అవుతాయి. """/" / కర్పూరం యొక్క సువాసనను పీల్చడం వలన ఆందోళన తగ్గుతుంది.

మానసిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది.రాత్రుళ్ళు నిద్రించే ముందు దిండుపై కొన్ని చుక్క‌లు కర్పూర తైలాన్ని రుద్దాలి.

కర్పూర తైలం వాసన పీలిస్తే నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటారు.నిద్ర నాణ్య‌త పెరుగుతుంది.

మరియు రిఫ్రెష్‌గా మేల్కొలపడానికి కూడా క‌ర్పూర తైలం సహాయపడుతుంది.స్వచ్ఛమైన కర్పూరానికి శ్వాసకోశ రద్దీని తగ్గించే సామర్థ్యం ఉంది.

క‌ర్పూరం వాస‌న పీల్చినప్పుడు.అది నాసికా భాగాలను క్లియర్ చేస్తుంది.

జ‌లుబు, దగ్గు( Cold ,cough ) స‌మ‌స్య‌ల‌ను త‌రిమికొడుతుంది.పాదాల ప‌గుళ్ల‌ను కూడా క‌ర్పూరంతో వ‌దిలించుకోవ‌చ్చు.

వాట‌ర్ లో క‌ర్పూరం పొడి క‌లిపి ప‌గుళ్ల‌పై అప్లై చేసి సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

ఆపై వాట‌ర్ తో క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి.ఇలా చేస్తే ప‌గుళ్లు మాయం అవుతాయి.

కడుపు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. చిటికెలో తగ్గించే చిట్కాలు ఇవి!