తెల్ల జుట్టుతో చింతే వద్దు.. ఈ రెమెడీని ఫాలో అవ్వండి!

వయసు పైబ‌డిన తర్వాత జుట్టు తెల్ల బడటం సర్వసాధారణం.అయితే ఇటీవల కాలంలో పాతిక‌, ముప్పై ఏళ్ల వారు సైతం తెల్ల జుట్టు సమస్యను ఫేస్ చేస్తున్నారు.

ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.అయితే కారణం ఏదైనా తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు.

కానీ ఇకపై తెల్ల జుట్టుతో చింతే వద్దు.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే తెల్ల జుట్టును సహజంగానే నల్లగా మార్చుకోవచ్చు.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్ వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగిస్తే జెల్లీ స్ట్రక్చర్ లోకి మారుతుంది.

అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పల్చటి వస్త్రం సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జెల్ పూర్తిగా చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడి, వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ హెన్నా పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.

చివరిగా రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ఒక గంట పాటు వదిలేయాలి.

అనంతరం ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధ‌రించాలి.

రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా తలస్నానం చేయాలి.

"""/" / హెన్నా పౌడర్‌ను వాడటం వల్ల జుట్టు డ్రైగా మారుతుంటుంది.అందుకే తల స్నానం చేసిన తర్వాత కురులను శుభ్రంగా ఆరబెట్టుకుని కొబ్బరి నూనె లేదా బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్ ను అప్లై చేసుకోవాలి.

ఇక పైన చెప్పిన రెమెడీని వారంలో రెండు సార్లు పాటిస్తే తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.

అలాగే తెల్ల జుట్టు సమస్య లేనివారు కూడా ఈ రెమెడీని పాటించవచ్చు.తద్వారా తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.

సైకిల్ పై వెళ్తున్న అమ్మాయిని టీజ్ చేసిన అబ్బాయి.. చివరకు? (వీడియో )