తెల్ల జుట్టు నుంచి చుండ్రు వరకు అన్నిటికీ చెక్ పెట్టే పవర్ ఫుల్ హోమ్ రెమెడీ మీకోసం!
TeluguStop.com
తెల్ల జుట్టు తో( White Hair ) బాధపడుతున్నారా.? చుండ్రు సమస్య( Dandruff ) తీవ్రంగా వేధిస్తోందా.
? హెయిర్ ఫాల్( Hair Fall ) సమస్యతో విసిగిపోయారా.? అయితే ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టే ఒక పవర్ ఫుల్ రెమెడీ ఉంది.
ఈ రెమెడీని పాటిస్తే తెల్ల జుట్టు నుంచి చుండ్రు వరకు అనేక సమస్యలను సులభంగా నివారించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.
ఇలా మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఐరన్ కడాయి తీసుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పౌడర్ వేసుకోవాలి.
అలాగే సరిపడా మెంతులు మరిగించిన వాటర్ పోసి కలుపుకోవాలి. """/" /
ఆపై మూత పెట్టి ఒక నైట్ అంతా వదిలేయాలి.
మరుసటి రోజు ఉదయాన్నే మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక అరటిపండు, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న ప్యూరీని హెన్నా మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేయాలి.
"""/" /
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది.
చుండ్రు సమస్య దూరం అవుతుంది.స్కాల్ప్ శుభ్రంగా మారుతుంది.
జుట్టు రాలడం తగ్గు ముఖం పడుతుంది.జుట్టుకు చక్కటి పోషణ అందుతుంది.
దాంతో కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.మరియు జుట్టు చిట్లడం, విరగడం వంటి సమస్యలు సైతం అదుపులోకి వస్తాయి.
పామును చీల్చి చెండాలిన శునకాలు.. వైరల్ వీడియో