పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ అసహ్యంగా కనిపిస్తున్నాయా? అయితే ఇలా వదిలించుకోండి!
TeluguStop.com
స్ట్రెచ్ మార్క్స్.స్త్రీలలో చాలా మందిని వేధించే కామన్ సమస్య ఇది.
ముఖ్యంగా ప్రసవం అనంతరం దాదాపు మహిళలందరికీ పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ పడుతుంటాయి.ఇవి చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి.
ఈ క్రమంలోనే స్ట్రెచ్ మార్క్స్ ను వదిలించుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.
ముఖ్యంగా ఖరీదైన క్రీములు, సీరంలు కొనుగోలు చేసి వాడుతుంటారు.కొందరైతే వేలకు వేలు ఖర్చుపెట్టి ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.
కానీ ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా చాలా సులభంగా మరియు వేగంగా స్ట్రెచ్ మార్క్స్ ను వదిలించుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
"""/"/
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఐదు నిమిషాల పాటు ఉంచి హీట్ చేయాలి.
ఇలా హీట్ చేసిన ఆయిల్ ను పొట్టపై నేరుగా అప్లై చేసి వేళ్ళతో స్మూత్ గా కనీసం పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
గంట లేదా రెండు గంటల అనంతరం గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.ఈ విధంగా ప్రతిరోజు చేస్తే కనుక పొట్టపై ఏర్పడే స్ట్రెచ్ మర్క్స్ క్రమంగా దూరం అవుతాయి.
మరియు పొట్ట వద్ద సాగిన చర్మం టైట్ గా కూడా మారుతుంది.కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ రెమెడీని పాటించేందుకు ట్రై చేయండి.
మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి.
డొనాల్డ్ ట్రంప్ టీమ్‌లో మరో భారత సంతతి నేత .. ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?