ప్రసవం తర్వాత ముఖ చర్మం సాగినట్లు ఉందా? అయితే ఇలా చేయండి!
TeluguStop.com
ప్రసవం తర్వాత మహిళల చర్మంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి.మునుపటి కల, మెరుపు కనిపించనే కనిపించవు.
అలాగే కొందరి ముఖ చర్మం సాగినట్లు కూడా అవుతుంది.దాంతో సాగిన చర్మాన్ని మళ్లీ టైట్‌గా మార్చుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
మార్కెట్‌లో లభ్యమయ్యే రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు.అయినప్పటికీ ఫలితం లేకుంటే ఏం చేయాలో అర్థంగాక తెగ సతమతం అవుతుంటారు.
ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.
ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని ట్రై చేస్తే చాలా సులభంగా మరియు వేగంగా ముఖ చర్మాన్ని టైట్‌గా మరియు బ్రైట్‌గా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.ముందుగా చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్ ను వేసుకోవాలి.
ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, రెండు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కూడా వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.
"""/" / ఇప్పుడు ఏదైనా బ్రష్ సాయంతో ఈ మిశ్రమాన్ని ముఖానికి, కావాలి అనుకుంటే మెడకు కాస్త మందంగా అప్లై చేసుకోవాలి.
పదిహేను లేదా ఇరవై నిమిషాల అనంతరం నార్మల్ వాటర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకుని.
తడి లేకుండా టవల్‌తో చర్మాన్ని తుడుచుకోవాలి.ఆపై మంచి సీరమ్‌ను ముఖానికి అప్లై చేసి సున్నితంగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
ఇలా తరచూ చేస్తుంటే సాగిన చర్మం బిగుతుగా మారుతుంది.మరియు ముఖం కాంతివంతంగా కూడా తయారవుతుంది.
కాబట్టి, ప్రసవం తర్వాత ఎవరైతే సాగిన చర్మంతో ఇబ్బంది పడుతున్నారో.వారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.