హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్న ఈ పవర్ ఫుల్ ఆయిల్ తో చెక్ పెట్టండి.. వారానికి ఒక్కసారి వాడితే చాలు!

సాధారణంగా కొందరిలో హెయిర్ ఫాల్ ( Hair Fall )అనేది చాలా తీవ్రంగా ఉంటుంది.

జడ వేసుకున్న, తల స్నానం చేసిన పెద్ద మొత్తంలో జుట్టు ఊడిపోతుంటుంది.దాంతో తెగ హైరానా పడిపోతుంటారు.

ఎలా హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడాలో తెలియక స్ట్రెస్ కు లోనవుతారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఆయిల్ మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.

హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఈ ఆయిల్ తో సులభంగా చెక్ పెట్టవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక పెద్ద అల్లం( Ginger ) ముక్కను తీసుకుని పొట్టు తొలగించి సన్నగా తురుముకోవాలి.

అలాగే మిక్సీ జార్ లో రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్( Kalonji Seeds ) వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కప్పు కొబ్బరి నూనె, ఒక కప్పు ఆవనూనె వేసుకోవాలి.

అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు అల్లం తురుము, గ్రైండ్ చేసి పెట్టుకున్న కలోంజి సీడ్స్ పౌడర్, మూడు రెబ్బలు కరివేపాకు( Curry Leaves ) వేసి కనీసం ప‌న్నెండు నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

"""/" / ఆ తర్వాత స్ట‌వ్ ఆన్‌ చేసి ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార‌బెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయిన అనంతరం ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ ను స్కాల్ప్ కు బాగా పట్టించి కనీసం ప‌ది నిమిషాలు అయినా మసాజ్ చేసుకోవాలి.

నైట్ నిద్రించే ముందు ఆయిల్ ను అప్లై చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ ఆయిల్ ను వాడితే చాలు జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది.

"""/" / హెయిర్ ఫాల్ సమస్యను సమర్థవంతంగా మరియు వేగంగా నివారించడానికి ఈ ఆయిల్ చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.జుట్టుకి చక్కటి పోషణ అందుతుంది.

దాంతో జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడుగ్గా సైతం పెరుగుతుంది.చుండ్రు సమస్య ఉన్న సరే మాయం అవుతుంది.

కాబట్టి తీవ్రమైన హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా ఈ పవర్ ఫుల్ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

కమల్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇండియన్2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?