నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఇటీవల రోజుల్లో ఎంతో మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు ( White Hair )సమస్యతో బాగా నలిగిపోతున్నారు.

తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు తరచూ కలర్స్ పై ఆధారపడుతున్నారు.అయితే తెల్ల జుట్టు వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం ఎంతో మేలు.

ముఖ్యంగా అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.నెలలో కేవలం రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు మీ దరిచేరదు.

పైగా ఈ రెమెడీ వల్ల మరెన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మందారం పొడి( Hibiscus Powder ), రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పొడి( Henna Powder ), వన్ టేబుల్ స్పూన్ వేపాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పొడి, వన్ టేబుల్ స్పూన్ కలబంద పొడి, వన్ టేబుల్ స్పూన్ పెసర పిండి, వన్ టేబుల్ స్పూన్ మెంతుల పొడి, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి‌ వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, ఒక ఎగ్ వైట్ తో పాటు సరిపడా బియ్యం కడిగిన వాటర్ ను వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మూత పెట్టి అరగంట పాటు వదిలేయాలి.

ఆ తర్వాత జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి.నెలలో రెండంటే రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే చాలు.

ఈ రెమెడీ వల్ల మీ జుట్టులో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది.దాంతో తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.

వయసు పై బడిన సరే మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది.అలాగే ఈ రెమెడీ వల్ల తలలో వేడి తగ్గుతుంది.

చుండ్రు సమస్య దూరం అవుతుంది.జుట్టు పట్టు కుచ్చులా మారుతుంది.

హెయిర్ ఫాల్‌ కంట్రోల్ అవుతుంది.మ‌రియు కురులు ఒత్తుగా పొడుగ్గా సైతం పెరుగుతాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : హాట్ హాట్‌ ట్రంప్ – బైడెన్ డిబేట్ .. ఇద్దరూ తగ్గట్లేదుగా ..!!