వైట్ హెయిర్‌తో వ‌ర్రీ వ‌ద్దు.. ఈ సింపుల్ రెమెడీని ప్ర‌య‌త్నించండి చాలు!

ఇటీవల కాలంలో నలభై ఏళ్లు వచ్చాయంటే చాలు తెల్ల జుట్టు పనిగట్టుకుని మరీ వచ్చి పలకరిస్తుంది.

దీంతో నలభై ఏళ్ల వారు కాస్త అరవై ఏళ్ల వారి మాదిరి కనిపిస్తుంటారు.

ఈ క్రమంలోనే వైట్ హెయిర్ ను దాచేయడానికి తరచూ కలరింగ్ చేసుకుంటూ నానా తంటాలు పడుతుంటారు.

అయితే న్యాచురల్ గా కూడా వైట్ హెయిర్ ను నివారించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోం రెమెడీ గ్రేట్‌గా సహాయపడుతుంది.

మరి ఆ రెమెడీ ఏంటి.? దాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి.

? వంటి విషయాలపై ఆలస్యం చేయకుండా ఓ లుక్కేయండి.ముందు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్‌ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడర్ వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.

ఆపై టీ డికాషన్ ను స్టైనర్ సహాయంతో ఫిల్ట‌ర్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ పౌడర్, మూడు టేబుల్ స్పూన్లు బృంగరాజ్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి.

ఆపై అందులో త‌యారు చేసి పెట్టుకున్న టీ డికాక్ష‌న్‌ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక నైట్ అంతా వదిలేయాలి.

మరుసటి రోజు ఉదయం అందులో రెండు ఎగ్స్ ను చితక్కొట్టి వేసి బాగా క‌లిపాలి.

"""/"/ ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ను ధరించాలి.

రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారంలో ఒక్కసారి ఈ విధంగా చేస్తే తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.మరియు కొత్త తెల్ల వెంట్రుకలు రాకుండా సైతం ఉంటాయి.

అనిల్ రావిపూడి సినిమాలో గ్యాంగ్ లీడర్ నాటి చిరంజీవి కనిపిస్తాడా..?