ముఖంపై ముదురు రంగు మచ్చలు పోవడం లేదా.. అయితే ఇది ట్రై చేయండి!

సాధారణంగా కొందరికి ముఖంపై ముదురు రంగు మచ్చలు( Scars ) ఏర్పడుతుంటాయి.ఈ మ‌చ్చ‌ల‌ కారణంగా అద్దంలో ముఖాన్ని చూసుకున్న ప్రతిసారి ఎంతగానో మదన పడుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఆ మచ్చలను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.అయితే కొందరిలో ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఈ ముదురు రంగు మచ్చలు ఓ పట్టాన వదిలిపెట్టవు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీ గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. """/"/ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు కొబ్బరి నీళ్లు వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ గడ్డ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి.

చివరిగా రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్, రెండు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్( Tea Tree Essential Oil ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ప‌దిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఫైన‌ల్ గా తడి లేకుండా చర్మాన్ని తుడుచుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

రోజుకి ఒకసారి ఈ హోమ్ రెమెడీని పాటిస్తే మీ చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయమవుతాయి.

"""/"/ ఆరెంజ్ పీల్ పౌడర్( Orange Peel Powder ), లెమన్ జ్యూస్, పసుపు.

ఇవన్నీ ముదురు రంగు మ‌చ్చ‌ల‌ను నివారించ‌డానికి, చ‌ర్మం రంగును పెంచ‌డానికి అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

కొబ్బరినీళ్లు( Coconut Water ) చర్మాన్ని కాంతివంతంగా, య‌వ్వ‌నంగా మారుస్తాయి.పెరుగు, టీ ట్రీ ఆయిల్ చర్మాన్ని తేమగా, మృదువుగా మెరిసేలా చేస్తాయి.

కొద్ది రోజుల్లోనే మచ్చలు లేని మెరిసే తెల్లటి అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.

కాబట్టి ముదురు రంగు మచ్చలతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని ప్రయత్నించండి.

“క” సినిమాతో కిరణ్ అబ్బవరం ఖాతాలో సంచలన రికార్డ్.. రేంజ్ పెరిగిందిగా!