తక్కువ ధరకే హోండా నుంచి పవర్‌ఫుల్ బైక్ లాంచ్.. దాని ఫీచర్లు ఇవే..
TeluguStop.com
ప్రముఖ టూ-వీలర్స్ తయారీ కంపెనీ హోండా ( Honda )ఈ ఏడాది దాని పాపులర్ బైక్స్‌కు అప్‌డేటెడ్ వెర్షన్లను లాంచ్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ కంపెనీ హోండా హార్నెట్( Honda Hornet ) 2.0 2023 అప్‌డేట్ వెర్షన్ లాంచ్ చేసింది.
ఇది ఇప్పుడు OBD2 కంప్లైంట్ కాగా ఇది E20 ఇంధనంతో పని చేస్తుంది.
39 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ ధర నిర్ణయించింది.ఓల్డ్ వెర్షన్ తో పోలిస్తే దీని ధర కాస్త పెరిగిందని చెప్పవచ్చు.
కానీ మంచి పర్ఫామెన్స్ అందిస్తున్న దాని సిగ్మెంట్‌లో అదే చవకైనది.ఈ పవర్‌ఫుల్ మోటార్ సైకిల్‌లో అసిస్ట్ స్లిప్పర్ క్లచ్‌ని కూడా ఆఫర్ చేశారు.
మునుపటి వెర్షన్‌ల లాగానే ఈ సరికొత్త బైక్ అదే 184.40cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, టూ-వాల్వ్ ఇంజన్‌తో వస్తుంది.
కానీ ఇప్పుడు ఉద్గార పనితీరును పర్యవేక్షించడానికి బహుళ సెన్సార్లను కలిగి ఉంది. """/" /
2023 హోండా హార్నెట్ 2.
0 అనేది స్పోర్టీ కమ్యూటర్ మోటార్‌సైకిల్( Sporty Commuter Motorcycle ) సస్పెన్షన్ ముందు వైపున అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ ఆఫర్ చేశారు.
ఇందులో అందించిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిజిటల్ వేగం, RPM, బ్యాటరీ వోల్టేజ్, ట్రిప్ మీటర్లు, గేర్ పొజిషన్, సర్వీస్ డ్యూ ఇండికేటర్ వంటి సమాచారాన్ని చూపుతుంది.
సింగిల్-ఛానల్ ABSతో డ్యూయల్ పెటల్ డిస్క్ బ్రేక్‌ల ద్వారా బ్రేకింగ్ సురక్షితమైన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
మోటార్‌సైకిల్ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ సాంగ్రియా రెడ్ మెటాలిక్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది.
2023 హోండా హార్నెట్ 2.0 కూడా 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది (3 సంవత్సరాల స్టాండర్డ్ + 7 సంవత్సరాల ఆప్షనల్).
కంపెనీ చెప్పినట్లు ఈ బైక్ మైలేజ్ 45 Kmpl, గరిష్ట వేగం 130 Kmph, సీటు ఎత్తు 790 మిమీ.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి11, మంగళవారం 2025