మహేష్ బర్త్ డే…. స్పెషల్ విషెస్ తెలియజేసిన పవన్ కళ్యాణ్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ( Mahesh Babu ) బాబు నేడు 48వ పుట్టినరోజు( Birthday ) వేడుకలను జరుపుకుంటున్నారు.

నేడు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఈయన తన ఫ్యామిలీతో కలిసి లండన్ లో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.

ఇక తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఇతర సినీ సెలబ్రిటీలు మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే మహేష్ బాబుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

"""/" / మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వ్యక్తిగతంగా ఎంతో మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే.

ఇక ప్రతి క్రిస్మస్ కు మహేష్ బాబు దంపతులకు పవన్ కళ్యాణ్ దంపతులు కానుకలు పంపించడం అలాగే పవన్ తోటలో పండిన మామిడి పండ్లను మహేష్ బాబుకు పంపిస్తూ వారి మధ్య ఉన్నటువంటి స్నేహ బంధాన్ని తెలియజేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఇటు మహేష్ బాబు అభిమానులు అటు పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / మరి పవన్ కళ్యాణ్ మహేష్ బాబుకి ఏమని శుభాకాంక్షలు చెప్పారనే విషయానికి వస్తే.

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన పంథా కలిగినటువంటి అగ్రశ్రేణి హీరో అయినటువంటి శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

శ్రీ మహేష్ బాబు కథానాయకుడిగా అందుకున్నటువంటి ఘన విజయాలు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయి.

తండ్రి కృష్ణ గారి అడుగుజాడలలో వెళ్తూ విభిన్నమైన పాత్రల్లో మెప్పించే అభినయ సామర్ధ్యం అయన సొంతం.

సోదర సమానుడైన శ్రీ మహేష్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆనందంతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

బన్ మస్కా అండ్ చాయ్ ట్రై చేసిన బ్రిటిష్ మహిళ.. రియాక్షన్ ఇదే..??