గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న పవర్ స్టార్ చెల్లి…
TeluguStop.com
పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కెరియర్ లో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా తొలిప్రేమ( Tholi Prema ).
ఈ సినిమాలో లో పవన్ కళ్యాణ్ చెల్లిగా నటించిన వాసుకి( Vasuki ) ఆ పాత్రతో అందర్నీ మెప్పించింది.
కానీ ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు.పవన్ కళ్యాణ్ స్నేహితుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ( Anandha Sai )ని ప్రేమించి పెళ్లి చేసుకుంది వాసుకి.
వీరి పెళ్లి పవన్ కళ్యాణ్ దగ్గరుండి చేశాడు.పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన వాసుకి ఇన్నాళ్లకు మళ్ళీ వెండితెరపై కనిపించబోతుంది.
లేడి డైరెక్టర్ నందిని రెడ్డి( Nandhini Reddy ) డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం అన్నీ మంచి శకునములే( Anni Manchi Sakunamu ).
ఈ మూవీలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ లు హిరో హిరోయిన్ లుగా నటిస్తున్నారు.
"""/" / ఈ సినిమా మే 18న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్( Promotions ) లో బిజీగా ఉన్నారు.అ ఈ సినిమాలో దాదాపు 25 ఏళ్ళ తర్వాత వాసుకి నటించింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వాసుకి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది.
తొలిప్రేమ సినిమా చేశాక చాలా అవకాశాలు వచ్చాయి.కానీ తనకు చెయ్యడం కుదర్లేదు.
తాను మల్టీటాస్క్ చేయలేను.ఇక పెళ్లి అయ్యాక ఫ్యామిలీ( Family ), పిల్లలతో ఇన్నాళ్లు గడిపేసానని చెప్పారు.
"""/" /
ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయి విదేశాల్లో చదువుకుంటున్నారు కాబట్టి తీరిక సమయం దొరికిందని అందుకే ఈ రీఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లు చెప్పుకోచ్చారు.
అయితే తాను నేను సినిమాల్లో నటించకపోయినా తమ ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణమే ఉంటుందని.
తన భర్త రోజూ సినిమాల గురించి మాట్లాడతారు అని తెలిపింది.ఇకపై కూడా మంచి పాత్రలు వస్తే కచ్చితంగా సినిమాలు చేస్తాను అని తెలిపింది.
దీంతో పవన్ కి సోదరిగా నటించిన వాసుకి ఇన్నేళ్ల తర్వాత సినిమాల్లో నటిస్తుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలను పెంచాయి.
ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మొదటి సినిమాపై ఫాన్స్ రియాక్షన్ ఏలా ఉంటుందో చూడాలి.
స్కూటర్‌పై వెళ్తున్న యువతిని అక్కడ తాకిన కామాంధుడు.. వీడియో వైరల్..