Power Star Pawan Kalyan Shoes Price Details, Pawan Kalyan , Pawan Kalyan Shoes, Hari Hara Veeramallu Movie, Director Krish, Mm Keeravani, Pawan Kalyan Shoe Price - వామ్మో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూస్ ఖరీదు అన్ని లక్షలా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా సంచలనమే అన్న సంగతి తెలిసిందే.త్వరలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించి వర్క్ షాప్ జరుగుతోంది.పవన్ ఈ సినిమా కోసం 50 రోజుల డేట్లు కేటాయించగా ఆ డేట్లు పూర్తయ్యేలోగా క్రిష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాల్సి ఉంది.

అయితే వర్క్ షాప్ కు హాజరైన పవన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.వైరల్ అయిన ఫోటోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ధరించిన షూస్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

కోపెన్ హాగన్ బ్రాండ్ కు ధరించిన షూస్ ను పవన్ ధరించగా ఈ షూస్ ఖరీదు ఏకంగా 9 లక్షల 60 వేల రూపాయలు కావడం గమనార్హం.

షూస్ కోసం పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ లో ఖర్చు చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.షూస్ ధర తెలిసి పవన్ అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

< -->పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసే వరకు పొలిటికల్ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారు.వచ్చే ఏడాది జూన్ లోగా పవన్ సినిమాల షూటింగ్ ను పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందించిన విషయం తెలిసిందే.వినోదాయ సిత్తం రీమేక్ ను పవన్ ఎప్పుడు మొదలుపెడతారో చూడాల్సి ఉంది.

< -->మరోవైపు పవన్ నటించాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు సంబంధించి అప్ డేట్ రావాల్సి ఉంది.హరీష్ శంకర్ ఈ సినిమా గురించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశం అయితే ఉంది.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు.

క్లిక్ పూర్తిగా చదవండి

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 9, శుక్రవారం 2022

అంకితా దవే అందాల విందు

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 8, గురువారం 2022

Remake Movies Pawan Kalyan : రీమేక్‌లతో పవన్‌ దారి తప్పుతున్నారా? ఇదంతా తప్పకే చేస్తున్నారా?

CM KCR TSPSC :తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ TSPSC నుండి మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్..!!

అట్లుంటది డీజే టిల్లు హీరోతో.. మరో హీరోయిన్ మూవీకి గుడ్ బై చెప్పిందిగా?