వామ్మో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూస్ ఖరీదు అన్ని లక్షలా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా సంచలనమే అన్న సంగతి తెలిసిందే.త్వరలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించి వర్క్ షాప్ జరుగుతోంది.పవన్ ఈ సినిమా కోసం 50 రోజుల డేట్లు కేటాయించగా ఆ డేట్లు పూర్తయ్యేలోగా క్రిష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాల్సి ఉంది.

అయితే వర్క్ షాప్ కు హాజరైన పవన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.వైరల్ అయిన ఫోటోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ధరించిన షూస్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

కోపెన్ హాగన్ బ్రాండ్ కు ధరించిన షూస్ ను పవన్ ధరించగా ఈ షూస్ ఖరీదు ఏకంగా 9 లక్షల 60 వేల రూపాయలు కావడం గమనార్హం.

షూస్ కోసం పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ లో ఖర్చు చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.షూస్ ధర తెలిసి పవన్ అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

< -->పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసే వరకు పొలిటికల్ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారు.వచ్చే ఏడాది జూన్ లోగా పవన్ సినిమాల షూటింగ్ ను పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందించిన విషయం తెలిసిందే.వినోదాయ సిత్తం రీమేక్ ను పవన్ ఎప్పుడు మొదలుపెడతారో చూడాల్సి ఉంది.

< -->మరోవైపు పవన్ నటించాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు సంబంధించి అప్ డేట్ రావాల్సి ఉంది.హరీష్ శంకర్ ఈ సినిమా గురించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశం అయితే ఉంది.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు.

క్లిక్ పూర్తిగా చదవండి

SSMB28.. నెట్ ఫ్లిక్స్ రికార్డ్ ధర..!

తన గెటప్ తో మతిపోగొట్టిన ఈషా రెబ్బకు నెటిజన్ షాక్.. ఏకంగా తనను దానితో పోలుస్తూ?

రెండో టి20లో న్యూజిలాండ్ పై టీమిండియా గెలుపు..!!

ఫిబ్రవరి 1 భీష్మ ఏకాదశి రోజు.. ఇలా చేస్తే ఐశ్వర్యం ఆరోగ్యం..

ఏపీ రాజధాని అమరావతి అని హైకోర్టు స్పష్టం చేసింది.. పయ్యావుల కేశవ్

తారకరత్న సిటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు