సోషల్ మీడియాలో పవర్ చూపించిన పవన్ ఫ్యాన్స్.. 24 గంటలు గడవక ముందే రికార్డ్!

మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అన్న మెగాస్టార్ కంటే కూడా పవన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరి పవన్ కు ఎంత క్రేజ్ ఉందో నిన్న మరోసారి నిరూపితం అయ్యింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో వకీల్ సాబ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈయన బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ ఫ్యాన్స్ ను మెప్పించాడు.

అయితే పవన్ ఎన్ని సినిమాలను లైన్లో పెట్టినా వాటిని పూర్తి చేయడంలో మాత్రం విఫలం అవుతున్నాడు.

పవన్ చేస్తున్న సినిమాల్లో ''హరిహర వీరమల్లు'' ఒకటి.ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపు కుంటుంది.ఏదో ఒక అడ్డంకి అయితే ఎదురవుతూనే ఉంది.

దీంతో ఎప్పుడు ఈ షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది.పవన్ రాజకీయాల కోసం అని షూటింగ్ కు బ్రేక్ వేయడంతో ఇంకా ముగింపు దశకు చేరుకోలేక పోతుంది.

అయితే ఇటీవలే ఈ సినిమా షూట్ రామోజీ ఫిలిం సిటీలో స్టార్ట్ చేసారు.

ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కూడా చాలా కష్టపడుతున్నాడు.పీరియాడికల్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

"""/"/ ఇక తాజాగా ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ ఒక అప్డేట్ పెట్టిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు పెట్టని ఎఫర్ట్స్ ను ఈ సినిమాకు పెడుతున్నారు.

అలాగే ఈ సినిమా రెగ్యురల్ షూట్ లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.ఇక పవన్ ఎప్పుడు కూడా తన సినిమా ప్రొమోషన్స్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు.

కానీ ఈ సినిమా కోసం నిన్న ఒక పోస్ట్ చేసాడు. """/"/ నిన్న తాను మార్షల్ ఆర్ట్స్ రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ ప్రిపేర్ అవుతున్న అంటూ పోస్ట్ చేయగా ఈ పోస్ట్ ను కొన్ని నిముషాల్లోనే వైరల్ చేసేసారు ఫ్యాన్స్.

అంతేకాదు 24 గంటలు కూడా గడవక ముందే ఈ పోస్ట్ కు లక్ష లైక్స్ ను క్రాస్ చేసేసి పవన్ స్టామినా ఏంటో తెలిసేలా చేసేసారు.

ఇప్పుడు దీనికి సంబందించిన ట్యాగ్ కూడా నెట్టింట వైరల్ అయ్యింది.