పవన్ నడుపుతున్న ఈ లగ్జరీ బైక్ ఖరీదెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరోలలో ఒకరు.

పవన్ సినిమాలు విడుదలైతే బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు కళ్లు చెదిరే రికార్డులను క్రియేట్ చేస్తాయి.

పవన్ క్రేజ్ ను చూసి ఆయన అభిమానులు సైతం పలు సందర్భాల్లో షాకవుతున్నారు.

ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

అయితే షూటింగ్ లొకేషన్ లో పవన్ ఖరీదైన బైక్ పై దర్శకమివ్వగా అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

బైక్ పై స్టైలిష్ గా కనిపిస్తున్న పవన్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఈ బైక్ ఖరీదు ఏకంగా 24 లక్షల రూపాయలు కాగా ఈ విషయం తెలిసిన నెటిజన్లు షాకవుతున్నారు.

బైక్ కోసం పవన్ అన్ని లక్షలు ఖర్చు చేశారా అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతుండగా పవన్ పాత్ర కొత్తగా ఉంటుందని సమాచారం.

"""/"/ ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుండగా పవన్ అభిమానులకు కిక్కిచ్చే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వచ్చే ఏడాది మార్చి టార్గెట్ గా ఈ సినిమా షూట్ జరుగుతుండగా ఆ సమయానికి ఈ సినిమా రిలీజవుతుందో లేదో చూడాల్సి ఉంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా పవన్, నిధి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదేననే సంగతి తెలిసిందే.

"""/"/ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని వార్తలు వైరల్ కాగా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

మరోవైపు పవన్ హరీష్ శంకర్ కాంబోలో మూవీ కచ్చితంగా ఉంటుందని సమాచారం.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

చిరంజీవి లైనప్ లో చేరిన మరో స్టార్ డైరెక్టర్…