ఆహా ఎంత జాగ్రత్త పడినా.. పవర్ స్టార్ ఫ్యాన్స్ దెబ్బకు సర్వర్స్ క్రాష్!

నందమూరి నటసింహం బాలయ్య ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే.

ఒకవైపు ఈయన చేస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంటే మరో వైపు బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో కూడా నెంబర్ వన్ షోగా నిలుస్తూ వస్తుంది.

అన్ స్టాపబుల్ షోకు బాలయ్య మొదటిసారి వ్యాఖ్యాతగా మారిపోయాడు.ఈ షో సీజన్ 1 ఘన విజయం అయ్యింది.

దీంతో సీజన్ 2 కూడా స్టార్ట్ చేసారు.ఈ సీజన్ లో స్టార్ హీరోలను రంగంలోకి దింపింది ఆహా సంస్థ.

మొన్ననే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాగా.ఇక ఇప్పుడు ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా విచ్చేసారు.

మరి పవన్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో పవన్ ఎపిసోడ్ ఫిబ్రవరి 2న ఆహా యాప్ లో స్ట్రీమింగ్ అయ్యింది.

ఈ ఎపిసోడ్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే వైరల్ అయ్యింది. """/"/ ప్రభాస్ అప్పుడే ఆహా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోక పోవడంతో సర్వర్స్ మొత్తం క్రాష్ అయ్యాయి.

అందుకే ఈసారి పవర్ స్టార్ ఎపిసోడ్ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేసింది.

అయితే ఆహా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ ముందు తలవంచక తప్పలేదు.

ఈ మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా దాడి చేసారు.

"""/"/ దీంతో సర్వర్స్ క్రాష్ అయ్యాయి.అంతేకాదు పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు.

ఈ ఎపిసోడ్ ఆహా లోనే ఫాస్టెస్ట్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసి ఆల్ టైం రికార్డ్ ను సెట్ చేసింది.

మరి ఒక్క రోజులోనే ఇన్ని వ్యూస్ రాబట్టగా ముందు ముందు ఈ ఎపిసోడ్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో వేచి చూడాలి.

గాయాల పాలైన నటి రష్మిక మందన్న… అసలేం జరిగిందంటే?