వర్షంతో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:జిల్లాలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ గాలివానకు సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని కుప్పిరెడ్డిగూడెం ఎస్సీ కాలనీలో రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
స్తంభాలు కూలిన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో మరియు ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు.
పడిపోయిన విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి,విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని
స్థానికులు కోరుతున్నారు.