ఉస్మానియా ఆస్పత్రిలో పవర్ కట్.. రోగుల అవస్థలు

హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో పవర్ కట్ కావడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

దాదాపు గంటన్నర సేపుగా కరెంట్ రాకపోవడంతో ఓపీ కార్డు కోసం రోగులు బారులు తీరారు.

ఇప్పటికే జారీ చేసిన ఓపీ కార్డు ఉన్నా మందులు ఇవ్వడం లేదని రోగులు వాపోతున్నారు.

కొత్త ఓపీ కార్డు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారని అంటున్నారు.దీంతో మరోసారి ఓపీ కార్డులు తీసుకునేందుకు బాధితులు క్యూ లైనులో పడిగాపులు కాస్తున్నారని సమాచారం.

పెట్టుబడి రూ.2 కోట్లు.. కలెక్షన్లు రూ.18 కోట్లు.. ఎన్టీఆర్ కు సొంతమైన రికార్డ్ ఇదే!