Nalgonda : విద్యుత్ మీటర్ బిల్లు తెలుగులో ముద్రించాలి
TeluguStop.com
మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో కరెంట్ మీటర్ బిల్లులు( Current Meter Bills In Telugu ) తెలుగులో ముద్రించాలని తెలంగాణ యువజన సేవా సంఘం అధ్యక్షుడు సుంకు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయ ఏఈ నిఖిత( AE Nikitha )కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు తెలుగులో కరెంట్ బిల్లు ఇచ్చినట్లయితే దేనికి ఎంత అవుతుందనే విషయాలు తెలుస్తాయని, అదేవిధంగా యూనిట్ల వారిగా ఎంత కరెంటు వాడుకుంటే ఎంత అమౌంట్ అవుతుందని సులువుగా అర్దం చేసుకుని దానికి తగినట్లుగా వాడుకుంటూ విద్యుత్ ను పొడుపు చేస్తారన్నారు.
మిర్యాలగూడ పట్టణంలో( Miryalaguda ) పనిచేస్తున్న లైన్మెన్,హెల్పర్లు,ఏఈలు నెంబర్లను వార్డులలో ప్రధాన కూడలి వద్ద గోడలపై వ్రాసి ఉంచినట్లయితే ప్రతి వినియోగదారునికి ఉపయోగకరంగా ఉంటుందని, వినియోగదారునికి ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.
కరెంట్ మీటర్ కి సంబంధించిన పత్రాలను ఆఫీస్ లో అందుబాటులోఉంచాలని, డిజిటల్ మీటర్ ఉండటం వలన అధిక బిల్లులు వస్తున్నాయని,డిజిటల్ మీటర్లను తొలగించి పాత పద్దతి ద్వారానే మీటర్లను ఏర్పాటు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన సేవ సంఘం ఉపాధ్యక్షుడు చెగొండి మురళి యాదవ్, దాసరాజు జయరాజు, వెంకటేశ్వర్లు,లతీఫ్,బాసీద్ తదితరులు పాల్గొన్నారు.