సంకల్పం ముందు ఓడిన పేదరికం…

సూర్యాపేట జిల్లా:చదువుకోవాలనే తపన,ఉద్యోగం సాధించాలనే పట్టుదల పేదరికాన్ని జయించింది.ఎలాంటి కోచింగ్ లేకుండా ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడి చదువుతూ ఒక్కటి కాదు,రెండు కాదు ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించింది ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువతి.

వివరాల్లోకి వెళితే.సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన మందుల ఈదయ్య,సుశీల దంపతుల చిన్న కుమార్తె మంగమ్మ గత సంవత్సరం నిర్వహించిన కేజివిబి పరీక్షలో పీజీటీ ఉద్యోగం( PGT Job ) సాధించడంతో పాటు,గురుకుల ఉపాధ్యాయుల నియామక ఫలితాలలో పీజీటీ,టీజీటీ, జూనియర్ లెక్చర్( Junior Lecture ) ఉద్యోగాలు సాధించింది.

ఈ సందర్బంగా ఆమె స్పందిస్తూ ఉద్యోగం సాధించాలనే ఏకైక లక్ష్యంతో ఎలాంటి కోచింగ్ కు వెళ్లకుండా హైదరాబాద్ ( Hyderabad )లో రూమ్ లోనే పుస్తకాలతో కుస్తీ పట్టడంతో ఈ ఉద్యోగాలు సాధించానని, తల్లిదండ్రులు కలను సాకారం చేయాలనే సంకల్పంతో మూడేళ్లు నిర్వీరామంగా కష్టపడ్డానని తెలిపింది.

సాధించాలనే లక్ష్యం ఉంటే ఎలాంటి విజయాన్నైనా అందుకోవచ్చని అన్నారు.10 సంవత్సరాల క్రితమే నా తండ్రి మరణించిన మా అమ్మ,అక్కల సహకారం,అన్నయ్య,ప్రెండ్స్, బంధువుల సూచనలే నా విజయానికి కారణాలని అన్నారు.

ఇంకా జనరల్ జేఎల్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు.పేదరికంలో ఉంటూ అహర్నిశలు కష్టపడి ఉద్యోగ లక్ష్య సాధనలో అందరికీ ఆదర్శంగా నిలిచిన మంగమ్మను స్పూర్తిగా తీసుకొని ప్రతీ ఒక్కరూ ముందుకు వెళ్లాలని పలువురు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.

పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?