సూర్యాపేట-దంతాలపల్లి రోడ్డుపై గుంతలు…కంప వేసిన స్థానికులు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:ఇటీవల కురిసిన భారీ వర్షాలకు( Heavy Rains ) సూర్యాపేట- దంతాలపల్లి రహదారిపై నెమ్మికల్ వద్ద రోడ్డు కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి.
నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి కావడంతో రాకపోకల సమయంలో వాహనదారులు, ప్రయాణికులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.
ఇరువైపులా నీరు,భారీ గుంతలు ఉండడంతో రోడ్డుపై ఒక వాహనం వస్తే మరొక వాహనం వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.
రాత్రి వేళల్లో ప్రయాణం మరింత
ప్రమాదకరంగా మారింది.కనీసం అక్కడ వెలుతురు కూడా లేకపోవడంతో వాహనదారులకు గుంతలు కనపడక ప్రమాదానికి గురవుతున్నారు.
అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు గుంతలపై కంప మండలు వేశారు.ఇప్పటికైనా ఆర్అండ్ బీ అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని,అప్పటి వరకు ప్రమాదాలు జరగకుండా లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరుకున్నారు.
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం ఆంధ్ర లెక్కలివే.. ఏ సినిమాకు ఎంతంటే?