ఈ అనారోగ్య స‌మ‌స్య‌లుంటే ఆలుగ‌డ్డ‌ల‌ను దూరం పెట్టాల్సిందే!

ఆలు గ‌డ్డ‌లువీటినే బంగాళ‌దుంపలు అని కూడా పిలుస్తారు.ప్ర‌పంచ‌వ్యాప్తంగా విరి విరిగా ఉప‌యోగించే దుంప కూర‌గాయ‌ల్లో ఆలు గ‌డ్డ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

దీనితో ఏ వంట‌కం చేసినా రుచి అద్భుతంగా ఉంటుంది.అందుకే పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది ఆలు గ‌డ్డ‌ను ఇష్టంగా తింటుంది.

ఇక రుచిలోనే కాదు.ఈ దుంప‌లో పోష‌కాలు కూడా మెండుగానే ఉంటాయి.

కాల్షియం, మెగ్నీషియం, ఐర‌న్‌, పొటాషియం, సోడియం వంటి మిన‌ర్స్‌తో పాటు విట‌మిన్ సి, విట‌మిన్ బి, విట‌మిన్ కె, రైబోఫోవిన్‌, థ‌యామిన్‌, కార్బోహైడ్రేట్స్‌, ఫైబ‌ర్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు ఆలు గ‌డ్డ‌లో ఉంటాయి.

అందుకు ఆరోగ్యానికి ఆలు గ‌డ్డ ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

అయితే ఆరోగ్యానికి ఎంత మంచి చేసిన‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం బంగాళ‌దుంప‌ల‌ను దూరం పెట్టాల్సిందే.

మ‌రి ఆ కొంద‌రు ఎవ‌రు ? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.అధిక ర‌క్త పోటు స‌మ‌స్య‌తో ఎవ‌రైతే బాధ ప‌డుతున్నారో వారు ఆలు గ‌డ్డ తీసుకోవ‌డం ఖ‌చ్చితంగా నివారించుకోవాలి.

ఎందుకంటే, ఆలు గ‌డ్డ‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్త పోటు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంది.

"""/"/ అలాగే ఓవ‌ర్ వెయిట్‌తో ఇబ్బంది ప‌డుతున్న వారు కూడా ఆలు గ‌డ్డ‌ల‌కు దూరంగా ఉండాలి.

బంగాళ‌దుంప‌ల్లో పిండి ప‌దార్థాల‌తో పాటు పొటాషియం కూడా అధికంగా ఉంటుంది.అందుకే, అధిక బ‌రువు ఉన్న వారు వీటిని తీసుకుంటే మ‌రింత బ‌రువు పెరుగుతారు.

ఇక ఆలు గ‌డ్డ‌ల్లో గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ‌లు ఎక్కువ‌గా ఉంటాయి.అందు వ‌ల్ల‌, మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు వీటిని తీసుకుంటే.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు భారీగా పెరుగుతాయి.దాంతో అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

సో.షుగ‌ర్ పేషెంట్లు కూడా ఆలు గ‌డ్డ‌ను తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లను కచ్చితంగా తినాల్సిందే!